![Keerthi Suresh Dance On Kalavathi Song Videos Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/21/k.jpg.webp?itok=N3_6yZ8g)
Keerthi Suresh Dance On Kalavathi Song Videos Goes Viral: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ 'కళావతి పాట' యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సాంగ్ ఇప్పటికే 35 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.
ఈ పాటపై ఇప్పటికే అనేకమంది నెటిజన్స్ రీల్స్ చేసి అలరించారు. అలాగే మహేశ్ బాబు గారాల పట్టి సితార 'కళావతి సాంగ్'పై అదిరిపోయేలా స్టెప్పులేసింది. తాజాగా 'కళావతి సాంగ్'పై కళావతే అంటే కీర్తి సురేష్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment