Puneeth Rajkumar Death: Puneeth Rajkumar's Last Dance Video Of Bhajarangi 2 Movie Promotions - Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: యశ్‌తో కలిసి స్టెప్పులు.. రాజ్‌కుమార్‌ చివరి డాన్స్‌ వీడియో వైరల్‌

Published Fri, Oct 29 2021 3:43 PM | Last Updated on Fri, Oct 29 2021 4:27 PM

Puneeth Rajkumar Death: Before Death Puneeth Rajkumar Bhajarangi 2 Dance Video Viral - Sakshi

కన్నడ ఇండస్ట్రీలో దేవుడిగా కొలిచే రాజ్‌కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న విషయాన్ని అభిమానులు జీర్జించుకోలేకపోతున్నారు. జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని భావించి ఆ తరువాత బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేని ఆయన.. సడెన్‌గా గుండెపోటుతో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

రెండు రోజుల క్రితం ఆయన ఓ ఈవెంట్‌లో కన్నడ స్టార్‌ యశ్‌తో కలిసి డాన్స్‌ చేశాడు. శివరాజ్‌ కుమార్‌ హీరోగా  ఏ.హర్ష తెరకెక్కించిన చిత్రం ‘జై భజరంగి 2’. సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల 29న విడుదలైంది. అయితే రెండు రోజుల కిత్రం అనగా అక్టోబర్‌ 27న ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి పునీత్‌ రాజ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయనతో పాటు కన్నడ స్టార్‌ హీరో యశ్‌ కూడా ఈ ఈవెంట్‌కి వచ్చాడు. ఈ సందర్భంగా స్టెజ్‌పై శివరాజ్‌, యశ్‌లతో కలిసి పునీత్‌ డాన్స్‌ చేశాడు. స్టార్‌ హీరోలైనప్పటికీ.. ఒకరి సినిమాకి మరొకరు సహాయం చేసుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇలా చాలా యాక్టీవ్‌గా ఉన్న పునీత్‌ రాజ్‌కుమార్‌.. సడెన్‌గా గుండెపోటుతో మరణించడం అభిమానులు జీర్జించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ డాన్స్‌ వీడియో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement