Shreyas Iyer's Steps To Trending Song Tum Tum With Sister Viral - Sakshi
Sakshi News home page

BGT 2023: ‘టమ్‌ టమ్‌’ పాటకు టీమిండియా క్రికెటర్‌ స్టెప్పులు.. వీడియో వైరల్‌

Published Sun, Feb 26 2023 8:41 AM | Last Updated on Sun, Feb 26 2023 10:27 AM

Shreyas Iyer Steps To Trending Song Tum Tum With Sister Viral - Sakshi

సోదరితో శ్రేయస్‌ అయ్యర్‌ (PC: Instagram)

Shreyas Iyer Shakes Leg For Tum Tum Song Video: టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆటలోనే కాదు డ్యాన్స్‌లోనూ అదరగొట్టగలడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నోసార్లు నిరూపించాడు కూడా! తాజాగా మరోసారి తన డాన్సింగ్‌ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడీ ముంబై బ్యాటర్‌.

తన తోబుట్టువు శ్రేష్టతో కలిసి ట్రెండింగ్‌ సాంగ్‌కి స్టెప్పులేశాడు. ‘‘మాల టమ్‌ టమ్‌.. మంతరం టమ్‌ టమ్‌’’ అంటూ తమిళపాటకు కాలుకదిపాడు. బాస్కెట్‌బాల్‌ కోర్టులో చెల్లెలితో కలిసి స్టెప్పులు అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రేయస్‌ సోదరి శ్రేష్ట ఇన్‌స్టాలో పంచుకోగా వైరల్‌ అవుతోంది.

‘ఉత్తమ పాటకు ఉత్తమ వ్యక్తితో డాన్సింగ్‌’ అంటూ దిష్టి తగలకూడదన్నట్లు ఎమోజీ జత చేసింది. కాగా శ్రేష్ట  కొరియోగ్రాఫర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక శ్రేయస్‌, శ్రేష్ట రోహిణి అయ్యర్‌- సంతోష్‌ అ‍య్యర్‌ దంపతుల సంతానం.

టెస్టు సిరీస్‌తో బిజీ
గాయం కారణంగా ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు దూరమైన మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ రెండో మ్యాచ్‌తో జట్టులోకి వచ్చాడు. అయితే, తన మార్కు చూపించడంలో విఫలమయ్యాడు. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు మాత్రమే చేసి నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు.

రెండుసార్లు స్పిన్నర్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఇక మార్చి 1 నుంచి ఇండోర్‌ వేదికగా ఆరంభం కానున్న మూడో టెస్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది.

చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్‌ చేస్తే 99 శాతం లిఫ్ట్‌ చేయడు.. అలాంటిది..
ENG vs NZ: న్యూజిలాండ్ కెప్టెన్ అరుదైన ఘనత.. ధోని రికార్డు సమం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement