Video: Old Man OO Jane Jane Song Dance With Foreigner Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: విదేశి యువకుడితో వృద్ధుడి అదిరిపోయే డ్యాన్స్‌!

Published Fri, Nov 26 2021 4:05 PM | Last Updated on Fri, Nov 26 2021 5:18 PM

Old man desi dance with Foreigner O O Jane Jana song video viral - Sakshi

డ్యాన్స్‌ వీడియోలు ఇటీవల కాలంలో విపరీతంగా సోషల్ మీడియలో ట్రెండ్‌ అవుతున్నాయి! అయితే పెళ్లిలో వధువరులు చేసిన డ్యాన్స్‌లు, వీధుల్లో సరదాగా కొంతమంది చేసిన డ్యాన్స్‌ వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వృద్ధుడు చేసిన  దేశీ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియోలో చక్కర్లు కొడుతోంది. ఓ విదేశి యువకుడు 1998 నాటి బాలీవుడ్‌ ‘ప్యార్ కియా తో దర్నా క్యా’ సినిమాలోని ‘ఓ ఓ జానే జానా’ పాటకు ఓ బస్టాండ్‌ ప్రాంగాణంలో డ్యాన్స్‌ చేశాడు. అయితే అక్కడే ఉన్న ఓ వృద్ధుడు దేశీ స్టైల్‌లో ఆ యువకుడితో స్టెప్పులు వేశారు.

అయితే ఆ విదేశి యువకుడి స్టెప్పులకు ధీటుగా వృద్ధుడు.. తనదైన శైలిలో హాహభావాలు పలికిస్తూ, పాట రిథమ్‌కు అనుగుణంగా చిందులు వేశారు. అక్కడ ఉన్నవారంతగా ఆశ్చర్యంతో వారి డ్యాన్స్‌ను ఆసక్తిగా తిలకించారు. ఓ ట్విటర్‌ యూజర్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు..  ‘దాదాజీ సూపర్‌ డ్యాన్స్‌’.. ‘విదేశియుడితో డ్యాన్స్‌ పోటీలో దాదాజీ గెలిచాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement