82 Year Old Man Dynamic Dance Video Gone Viral - Sakshi
Sakshi News home page

Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన పెద్దాయన..  కుర్రాళ్లు అసూయపడేలా స్టెప్పులు..

Published Mon, Feb 6 2023 8:34 PM | Last Updated on Mon, Feb 6 2023 9:24 PM

82 Year Old Man Dynamic Dance Video Gone Viral - Sakshi

ఆనందాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తపరుస్తారు. కొందరు సంతోషంగా ఉన్నప్పుడు మొహం వెలిగిపోతుంది. కళ్లు మెరుస్తాయ్. మాట తీరు కూడా మారిపోతుంది. ఇక పట్టరాని ఆనందం వస్తే మరికొందరు పాటలు పాడుతారు, కాలు కదిపి డ్యాన్స్ కూడా చేస్తుంటారు.

ఓ 82 ఏళ్ల వ్యక్తి కూడా సరిగ్గా ఇలానే చేశారు. పట్టలేని సంతోషంలో నృత్యం చేసి అదిరే స్టెప్పులతో అదరగొట్టారు. ఆ వయసులో ఆయన ఎనర్జీ చూస్తుంటే కూర్రాళ్లకు కూడా అసూయ పుట్టేలా ఉంది. అంతలా తనను తాను మర్చిపోయి డ్యాన్స్‌లో మునిగిపోయారు.

సూటు, బూటు ధరించి నాటు స్టెప్పులతో ఇరగదీసిన ఈ పెద్దాయన డ్సాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ పార్టీలో ఆయన డ్యాన్సే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ మీరూ చూసేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement