Viral Video Of Old Man Dancing On Road In Khammam: Telangana - Sakshi
Sakshi News home page

Viral Video: నడిరోడ్డుపై తాత స్టెప్పులు.. అవ్వ పరేషాన్‌

Published Tue, Mar 15 2022 3:06 PM | Last Updated on Tue, Mar 15 2022 4:03 PM

Viral Video Of Old Man Dancing On Road In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: ఓ తాత తాగినంకా తనదైనా స్టైల్‌లో నడిరోడ్డుపై స్టెప్పులు వేస్తూ అందరిని పరేషాన్‌కు గురిచేశాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా కట్టె పట్టుకొని రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నట్లు స్టెప్పులు వేశాడు. ఇక తన భర్తను కాపాడుకోవడానికి ఆ అవ్వ నరకయాతన అనుభవించి చివరికి ఆ తాత పోరు తట్టుకోలేక రోడ్డు పక్కనే కూర్చొని దీనంగా ఉండిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ వద్ద ఖమ్మం టూ బోనకల్ ప్రధాన  రహదారిపై ఓ తాత ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారమెత్తాడు. రోడ్డు మీద వెళ్లే ప్రతి వాహనాన్ని తనదైన శైలిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మాదిరిగా చేతిలో కట్టెతో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నట్లు రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ రోడ్డు మధ్యలో కొన్ని స్టెప్పులు వేశాడు. ఆ తాత దృశ్యం చూసే వారికి కొంత ఆహ్లాదకరంగా ఉన్న కానీ వాహనాలు ఆ తాత నీ ఢీ కొంటాయోనని అక్కడ స్థానికులు ఆందోళన చెందారు. ఇంకా తన భర్తను కాపాడుకోవడానికి ఆ అవ్వ నరకయాతన అనుభవించి చివరికి రోడ్డు పక్కనే కూర్చొని దీనంగా ఉండిపోయింది. ఈ ఘటన అక్కడ స్థానికులు సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
చదవండి: ఆరు నెలల పాటు సినిమాలు, వాట్సాప్‌ చూడకండి: కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement