ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన ట్రాఫిక్‌ పోలీస్‌.. డ్యాన్స్‌కు ఫిదా | Anand Mahindra posts video of Indore dancing cop | Sakshi
Sakshi News home page

ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన ట్రాఫిక్‌ పోలీస్‌.. డ్యాన్స్‌కు ఫిదా

Published Mon, Jul 29 2024 5:13 PM | Last Updated on Mon, Jul 29 2024 5:29 PM

Anand Mahindra posts video of Indore dancing cop

సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త  ఆనంద్ మహీంద్రా.. ఎన్నో ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే వీడియోలను తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా పంచుకుంటుంటారు . ఆయన ఏ పోస్టునైనా అలా షేర్ చేశారో లేదో.. నిమిషాల్లో వేలల్లో లైకులు, వ్యూస్ వచ్చేస్తుంటాయి. తాజాగా ఆయన రోడ్డుపై డ్యాన్స్‌ చేస్తున్న ట్రాఫిక్‌ పోలీస్‌ వీడియోను షేర్‌ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజిత్ సింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అక్కడ అతను 16 ఏళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అంద‌రూ చేతుల‌తో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తే రంజిత్ సింగ్ మాత్రం త‌న డ్యాన్స్‌తో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తాడు. గంటల కొద్దీ రోడ్డుపై నిల్చొని ఎలాంటి నీరసం, విసుగు లేకుండా ట్రాఫిక్‌లో ఆగి ఉన్న జ‌నాల‌కు త‌న స్టెప్పుల‌తో అల‌రిస్తాడు.  

అయితే ఇటీవల రంజిత్ సింగ్ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా. త‌న వీడియోను షేర్ చేస్తూ మండే మోటివేషన్ అంటూ పోస్ట్ పెట్టాడు. ‘ఈ పోలీస్ బోరింగ్ ప‌ని అంటూ ఏమి ఉండదు అని నిరుపించాడు. మ‌న పనిని మ‌నం ఎలా చేయాలి అనేది నీ ఛాయిస్ ’అంటూ రాసుకొచ్చాడు. కాగా ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement