Faria Abdullah: Teenmar Dance On The Road - Sakshi
Sakshi News home page

Faria Abdullah: ఆ సౌండ్‌కు కంట్రోల్‌ చేసుకోలేకపోయా..అందుకే

Published Thu, Oct 7 2021 3:28 PM | Last Updated on Thu, Oct 7 2021 4:35 PM

Faria Abdullah Maas Dance On Theenmar Band - Sakshi

Faria Abdullah Maas Dance On Theenmar Band: చిట్టి.. నా బుల్‌బుల్‌ చిట్టి.. అంటూ కుర్రకారు మనసు దోచుకున్న నటి, సొగసైన పొడగరి ఫరియా అబ్దుల్లా. తొలి సినిమా జాతిరత్నాలుతో ఇటు గ్లామర్‌ పరంగా అటు నటనాపరంగా వందశాతం మార్కులు కొట్టేసింది. హైదరాబాద్‌కు చెందిన ఈ లోకల్‌ బ్యూటీ మొదటి చిత్రంతోనే యూత్‌ను ఆకట్టుకుంది. ఇక జాతిరత్నాలు సినిమా అనంతరం ఇప్పటివరకు నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయని ఫరియా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: విడాకుల ఎఫెక్ట్‌: షూటింగ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సమంత

లేటెస్ట్‌ ఫోటోషూట్‌లు, వీడియోలతో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. తాజాగా నడిరోడ్డుపై తీన్మార్‌ స్టెప్పులకు చిందులేసింది ఈ బ్యూటీ. డ్రమ్స్ శబ్దం వస్తుంటే న‌న్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. డ్రమ్స్‌ పవర్‌ అదే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. పట్టుచీరలో చిట్టి డ్యాన్స్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ  'ఢీ' సిక్వెల్‏లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చదవండి: చై-సామ్‌ కాపురంలో చిచ్చు: 'అక్కా అని పిలిచే వ్యక్తితో'..


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement