
Ram Charan & Upasana Dance Together In Anushpala Wedding, Video Goes Viral: మెగా కోడలు ఉపాసన కొణిదెల కామినేని సోదరి అనుష్పల కామినేని వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. చాలా కాలంగా అర్మాన్ ఇబ్రహీంను ప్రేమిస్తున్న అనుష్ప పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకల్లో కామినేని ఫ్యామిలీతో పాటు మెగాఫ్యామిలీ కూడా పాల్గొంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ నుంచి మొదలు.. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ.. సంగీత్.. మేహంది.. పెళ్లి వేడుకల వరకు ప్రతి చిన్న వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరై సందడి చేశాడు. ఇక ఈ పెళ్లి చరణ్-ఉపాసనలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
చదవండి: ఊహా నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా చెర్రి తన భార్య ఉపాసన, మరదలు అనుష్పలతో కలిసి చిందులేస్తూ సందడి చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్స్ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు పాట పాడుతుంటే చరణ్ మరదలితో కలిసి డ్యాన్స్ చేస్తుండగా మధ్యలో ఉపాసన కూడా వారితో కలిసి స్టెప్పులెస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక సరదగా, సందడి చేస్తున్న చెర్రిని చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ వీడియో తమదైన శైలి కామెంట్ చేస్తూ తమ స్పందనను తెలుపుతున్నారు.
చదవండి: అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్‌లో ఫ్యాన్స్, ఇంతగా దిగజారిపోయావా!
Comments
Please login to add a commentAdd a comment