Virata Parvam Promotions: Sai Pallavi Dance In Vignan Engineering College Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sai Pallavi Dance Video: కాలేజ్‌లో డ్యాన్స్‌ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్‌..

Published Fri, Jun 17 2022 3:56 PM | Last Updated on Fri, Jun 17 2022 4:22 PM

Sai Pallavi Dance In Vignan Engineering College Video Goes Viral - Sakshi

Sai Pallavi Dance In Vignan Engineering College Video Goes Viral: బ్యూటిఫుల్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరోయిన్‌ సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం విరాట పర్వం. దగ్గుబాటి రానా సరసన సాయి పల్లవి వెన్నెలగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల అనంతరం ఎ‍ట్టకేలకు శుక్రవారం (జూన్‌ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి పాజిటివ్‌ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందు పలు ప్రమోషన్స్‌లలో సాయి పల్లవి పాల్గొన్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగానే సాయి పల్లవి, రానా, డైరెక్టర్‌ వేణు ఊడుగుల విశాఖపట్నంలోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. తర్వాత తనకు బాగా గుర్తింపు తెచ్చిన 'ఫిదా' సినిమాలోని వచ్చిండే 'మెల్ల మెల్లగ వచ్చిండే' పాటకు డ్యాన్స్‌ చేసి అలరించింది సాయి పల్లవి. స్టూడెంట్స్‌ అంతా కేరింతలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లైక్స్‌, కామెంట్స్‌తో దూసుకుపోతోంది. 

చదవండి: డేటింగ్‌ సైట్‌లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు
తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement