fidaa movie
-
సాయి పల్లవికి అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమాలు ఎన్నో తెలుసా..?
మలయాళీ బ్యూటీ సాయి పల్లవి టాలెంట్‌కు సినీ అభిమానులు ఫిదా అవుతారు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఆమె స్టార్‌గా ఎదిగింది. మర్ పాత్రల కన్నా కథలో బలం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటూ సత్తా చాటింది. తొమ్మిదేళ్ల కెరీర్లో ఆమె 19 సినిమాల్లో నటించింది. అయితే, ప్రతి చిత్రం కూడా ఒక ప్రత్యేకమనే చెప్పాలి. అలా మలయాళం, తెలుగు, తమిళంలోనూ ఆమెకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023లో సాయిపల్లవికి అవార్డ్ దక్కింది. అయితే, సాయి పల్లవి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 68 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో గార్గి చిత్రానికి తమిళంలో ఉత్తమ నటిగా అవార్డు దక్కితే.. తెలుగులో విరాటపర్వం చిత్రానికి గాను క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డ్ దక్కించుకుంది. ఇలా రెండు భాషల్లోనూ ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన హీరోయిన్గా ఆమె గుర్తింపు పొందింది.ప్రేమమ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత తెలుగులో ఫిదాలో భానుమతిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్‌లో ఓ అరుదైన ఘనతను కూడా ఆమె అందుకుంది. సౌత్ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకున్న హీరోయిన్గా సాయి పల్లవి నిలిచింది.సాయి పల్లవి అవార్డులు అందుకున్న సినిమాలుప్రేమమ్ (2015) – ఉత్తమ నటి (డెబ్యూ)ఫిదా (2017) – ఉత్తమ నటిలవ్ స్టోరీ (2021) – ఉత్తమ నటిశ్యామ్ సింగరాయ్ (2021) – ఉత్తమ నటి (క్రిటిక్స్)గార్గి (2022) – ఉత్తమ నటివిరాటపర్వం (2022) – ఉత్తమ నటి (క్రిటిక్స్) -
సాయి పల్లవి సినిమాలకు దూరం కావడానికి కారణం ఇదే
-
కాలేజ్‌లో డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..
Sai Pallavi Dance In Vignan Engineering College Video Goes Viral: బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం విరాట పర్వం. దగ్గుబాటి రానా సరసన సాయి పల్లవి వెన్నెలగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందు పలు ప్రమోషన్స్లలో సాయి పల్లవి పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సాయి పల్లవి, రానా, డైరెక్టర్ వేణు ఊడుగుల విశాఖపట్నంలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. తర్వాత తనకు బాగా గుర్తింపు తెచ్చిన 'ఫిదా' సినిమాలోని వచ్చిండే 'మెల్ల మెల్లగ వచ్చిండే' పాటకు డ్యాన్స్ చేసి అలరించింది సాయి పల్లవి. స్టూడెంట్స్ అంతా కేరింతలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లైక్స్, కామెంట్స్‌తో దూసుకుపోతోంది. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి The Natural Performer @Sai_Pallavi92 danced to her iconic song "vachinde" at Vignan engineering college, Vizag 💥💥💥 Receiving an ocean of love from the fans and audience ❤️❤️#VirataParvam @RanaDaggubati @venuudugulafilm @SLVCinemasOffl @SureshProdns#VirataParvamOnJune17th pic.twitter.com/ZNoglOlGw3 — Shreyas Media (@shreyasgroup) June 16, 2022 -
Love Story:‘‘ఫిదా’కు వద్దన్నారు..‘లవ్‌స్టోరీ’ పిలిచి మరీ ఇచ్చారు’
‘‘ఫిదా’ సినిమా కోసం శేఖర్ కమ్ములగారికి నేను పంపిన పాటలు నచ్చాయి. అయితే ‘ఫిదా’ నాకు చాలా ముఖ్యం.. ఈ సమయంలో కొత్తవాళ్లతో రిస్క్ చేయలేనని చెప్పి వద్దన్నారాయన. ‘లవ్‌స్టోరీ’ సినిమాకు మాత్రం పిలిచి అవకాశం ఇచ్చారు’’ అని సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ– ‘‘మా తాతగారు, నాన్నగారు విజయ్ సినిమాటోగ్రాఫర్స్‌గా చేశారు. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. చదువు పూర్తయ్యాక సంగీతం నేర్చుకున్నాను. ఒక సంగీత విభావరిలో ఏఆర్ రెహమాన్‌గారికి నా కంపోజిషన్ నచ్చి, సహాయకుడిగా పెట్టుకున్నారు. ఆయనతో ‘శివాజీ, రోబో, సర్కార్’ వంటి చిత్రాలు చేశాను. ‘లవ్‌స్టోరీ’ విషయానికొస్తే... ‘పాటలు సందర్భాన్ని ప్రతిబింబించాలి.. అంతకంటే ఇంకేం వద్దు’ అన్నారు శేఖర్‌గారు. కంపోజిషన్‌లో ఆయన ఇచ్చిన సలహాలు అద్భుతం. ఆయనకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం. ‘సారంగ దరియా..’ను బాగా చేయాలని చెప్పి చేయించారు. ‘లవ్‌స్టోరీ’ పాటలు మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం కొత్త సంగీత దర్శకుడిగా తృప్తిగా ఉంది. ఈ చిత్రంలోని పాటలు రెహమాన్‌గారికి పంపాలంటే భయమేసింది. కానీ నా మిత్రులు కొందరు నా పాటలు బాగున్నాయని ఆయనతో చెప్పారట. మంచి చిత్రాలు చేసి, సంగీత దర్శకుడిగా నాకంటూ ప్రత్యేకత తెచ్చుకోవాలనేది నా లక్ష్యం’’ అన్నారు. -
సౌత్ ఫిలింఫేర్ అవార్డులు-2018
సాక్షి, హైదరాబాద్: దక్షిణ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుకల్లో బాహుబలి ది కంక్లూజన్ సత్తా చాటింది. 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం గత సాయంత్రం(శనివారం) హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమల నటీనటులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగులో బాహుబలి-2 చిత్రం ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం 8 విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. అర్జున్ రెడ్డికి చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ, క్రిటిక్స్ విభాగంలో వెంకటేష్ దగ్గుబాటి గురు చిత్రానికి, ఫిదా చిత్రానికిగానూ ఉత్తమ నటిగా సాయి పల్లవి, క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా రితికా సింగ్(గురు చిత్రానికి), దర్శకధీరుడు రాజమౌళికి బాహుబలి-2కి ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకి జీవితకాల సాఫల్య పురస్కారం(లైఫ్ టైమ్ అచీవ్మెంట్) అవార్డు అందించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల అవార్డులను కేటగిరీలుగా పరిశీలిస్తే... తెలుగు ఉత్తమ చిత్రం - బాహుబలి 2 ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2) ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి) ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా) ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు సినిమా) ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు) ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2) ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2) ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2) ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) - అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్) జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్) ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్) ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2) తమిళం (కోలీవుడ్) ఉత్తమ చిత్రం - అరమ్ ఉత్తమ దర్శకుడు - పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద) ఉత్తమ నటుడు - విజయ్ సేతుపతి (విక్రమ్ వేద) ఉత్తమ నటి - నయనతార (అరమ్) ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు) ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - అదితి బాలన్ (ఆరువి) ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వైరముత్తు (కాట్రు వెలియిదయ్ - వాన్ మూవీ) ఉత్తమ సహాయ నటి - నిత్యా మీనన్ ఉత్తమ సహాయ నటుడు - ప్రసన్న ఉత్తమ నేపథ్య గాయకుడు - అనిరుధ్ రవిచందర్ ఉత్తమ నేపథ్య గాయని - శశా తిరుపతి ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్) ఉత్తమ తొలి నటుడు - వసంత్ రవి (తారామణి) మాలీవుడ్(మళయాళం) ఉత్తమ చిత్రం - తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ ఉత్తమ దర్శకుడు - దిలీష్ పోతెన్ ఉత్తమ నటుడు - ఫహద్ ఫజిల్ ఉత్తమ నటి - పార్వతి (టేక్ ఆఫ్) ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - టొవినో థామస్ ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - మంజూ వారియర్ ఉత్తమ సహాయ నటి - శాంతి కృష్ణ ఉత్తమ సహాయ నటుడు - అలెన్సియెర్ ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు) ఉత్తమ నేపథ్య గాయకుడు - షాబాజ్ అమన్ ఉత్తమ నేపథ్య గాయని - కేఎస్ చిత్ర ఉత్తమ సంగీత దర్శకుడు - రెక్స్ విజయన్ (మాయనది) ఉత్తమ తొలిచిత్ర నటుడు - ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్) ఉత్తమ తొలిచిత్ర నటి - ఐశ్వర్య లక్ష్మి కన్నడ(శాండల్‌వుడ్) ఉత్తమ చిత్రం - ఒందు మొట్టెయ కథె ఉత్తమ దర్శకుడు - తరుణ్ సుధీర్ (చౌక) ఉత్తమ నటుడు - రాజ్ కుమార ఉత్తమ నటి - శ్రుతి హరిహరన్ ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - ధనంజయ ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - శ్రద్ధా శ్రీనాథ్ ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వి. నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ - చౌక) ఉత్తమ సహాయ నటి - భవానీ ప్రకాశ్ ఉత్తమ సహాయ నటుడు - పి రవిశంకర్ ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్మాన్ మాలిక్ ఉత్తమ నేపథ్య గాయని - అనురాధ భట్ ఉత్తమ సంగీత దర్శకుడు - బీజే భరత్ -
ముందు మల్లు అర్జున్... ఇప్పుడు ‘ఫిదా’ వరుణ్!
మలయాళంలో మంచి మార్కెట్ సంపాదించుకున్న యంగ్ తెలుగు హీరోలు ఎవరు? అంటే... అల్లు అర్జున్ పేరు ముందు వినిపిస్తుంది. ఇప్పుడు బన్నీ రూటులో మరో మెగా హీరో వరుణ్‌తేజ్ వెళ్తున్నాడు. వరుణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘ఫిదా’. త్వరలో మలయాళంలో ఇదే పేరుతో సినిమాను విడుదల చేయనున్నారు. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్. మలయాళ ‘ప్రేమమ్’తో సాయిపల్లవికి స్టార్ స్టేటస్ వచ్చింది. నెక్ట్స్... శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ కూడా మలయాళంలో మంచి హిట్! అందువల్ల, ‘సాయిపల్లవి ఈజ్ బ్యాక్’, ‘ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ హ్యాపీడేస్’ పేరుతో మలయాళంలో పబ్లిసిటీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై మలయాళంలో సొంతంగా విడుదల చేయడానికి ‘దిల్’ రాజు సన్నాహాలు చేస్తున్నారట! బన్నీని మలయాళ ప్రేక్షకులు ముద్దుగా ‘మల్లు’ అర్జున్ అని పిలుచుకుంటారు. ఈ సినిమా మంచి హిట్టయితే వరుణ్‌తేజ్‌ను ‘ఫిదా వరుణ్’ అంటారేమో!! తెలుగులో 45 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందీ సినిమా. మలయాళంలో ఎంత కలెక్ట్ చేస్తుందో? వెయిట్ అండ్ సీ!! -
దుమ్మురేపుతున్న తెలుగు సినిమా
శేఖర్ కమ్ముల తాజా సినిమా 'ఫిదా' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మౌత్ పబ్లిసిటీతో భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో దాదాపు రూ. 40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ ఫిదా జోరు కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో కలెక్షన్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా అమెరికాలో రూ.8.82 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మున్ముందు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులతో పాటు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సాయిపల్లవి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ్ తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. -
సాయిపల్లవి నటనకు ఫిదా అయినా సమంత
హైదరాబాద్: వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఫిదా’ ఇప్పటికే చాలా మందిని ఫిదా చేసేసింది. తెలుగులో మొదటి సినిమాతోనే హీరోయిన్ సాయి పల్లవి తన నటనతో అందరిని అకట్టుకుంది. తెలంగాణ యాసతో చాలా బాగా మాట్లాడింది. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులతోపాటు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాతో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా చూసిన సమంత తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘‘ఫిదా సినిమా చాలా అందంగా, రిఫ్రిసింగ్గా ఉంది. శేఖర్ కమ్మల, వరుణ్ తేజ్ తోపాటు మొత్తం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు‘‘ అని సమంత ట్వీట్ చేశారు. అంతేకాక సాయి పల్లవిని పోగిడేశారు. సాయి పల్లవి చాలా అద్భుతంగా, అందంగా నటించారని చెప్పారు. సమంత ప్రేక్షకులకు సాయిపల్లవి నటించిన ఏ చిత్రానైనా చూడండని సూచించారు. హీరోయిన్ సాయిపల్లవి సమంత ట్వీట్ కు స్పందించి ‘‘మీకు ధన్యవాదాలు‘‘ అని ట్వీట్ చేశారు. ఫిదా చిత్రం జూలై 21న విడుదల అయింది. భానుమతి పాత్రలో సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించారు. ప్రముఖ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో కంటెస్టేంట్గా పాల్గొని అందరిని ఆకర్షించింది. అంచలంచెలుగా ఎదుగుతూ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. మలయాళం ప్రేమమ్ సినిమాలో కూడా సాయిపల్లవి చాలా అద్భుతంగా నటించింది.