దుమ్మురేపుతున్న తెలుగు సినిమా
శేఖర్ కమ్ముల తాజా సినిమా 'ఫిదా' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. మౌత్ పబ్లిసిటీతో భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో దాదాపు రూ. 40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ ఫిదా జోరు కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో కలెక్షన్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా అమెరికాలో రూ.8.82 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మున్ముందు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులతో పాటు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సాయిపల్లవి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ్ తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు.