కోల్‌కతా: ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇన్‌స్టాగ్రామ్ వీడియో కోసం ఓ యువతి రోడ్డుపై డ్యాన్స్ చేసి చిక్కుల్లో పడిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. బెంగాలీ సామాజిక కార్యకర్త, కమెడియన్, ఇన్‌ఫ్ల్యూయేన్సర్ సాండీ సాహా కోలకతాలోని మా ఫ్లైఓవర్‌పై భారీ ట్రాఫిక్ మధ్య స్టెప్పులేసింది. ఈ ఘటన సెప్టెంబర్ 13న చోటుచేసుకోగా దీనికి చెందిన వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసింది. వీడియోలో సాండీ ఫ్లై ఓవర్ మీదకు చేరుకోవడంతో ఆమె డ్రైవర్ కారును పక్కకు పార్క్ చేశాడు. వెంటనే కారు దిగిన సాండీ రద్దీగా ఉన్న రోడ్డుపై మరో వైపు వెళ్లి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. 'మెయిన్ ఆయ్ హన్ యూపీ బీహార్ లుట్నే' పాటపై చిందులేసింది.
చదవండి: రూ.10 కోట్లకు అమ్ముడుపోయిన రూపాయి నాణేం.. అంత ధర ఎందుకు!
అయితే మా ఫ్లైఓవర్ ఇలాంచి చర్యలకు సురక్షితం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో సాండీపై నెగిటివ్ కామెంట్ చేస్తూ కలకతా పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. చివరికి ఈ విషయం కోలకతా పోలీసులకు చేరడంతో ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఫ్లైఓవర్‌పై కారు ఆపినందుకు డ్రైవర్, కారు యాజమానికి సాండీపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. కాగా సాండీ సోషల్ మీడియాలో పాపులర్ అయిన మహిళ. తన ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ విషయాలపై చర్చిస్తూ నెటిజన్లకు టచ్‌లో ఉంటారు.
చదవండి: స్పైడర్‌మెన్‌లా గోడను పాకిన చిన్నారి.. ‘నీ టాలెంట్ సూపర్’
Comments
Please login to add a commentAdd a comment