
Disha Patani Sister Khushboo Patani Birthday Party Dance Video Goes Viral: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్‌ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ఇక ఆమెకు సోదరి ఖుష్బూ పటానీ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సినీ రంగంలో అడుగుపెట్టనప్పటికి తన అందం, గ్లామర్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఈ ఇద్దరూ అక్కాచెల్లెల్లు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
చదవండి: దిశా సోదరి గురించి తెలిస్తే ప్రశంసించక మానరు!
ఈ క్రమంలో ఓ వెకేషన్‌లో భాగంగా దిశా పటాని, తన సోదరి కుష్బూ పటానిలు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం దిశ సోదరి ఖుష్బూ పటానీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్‌డే పార్టీలో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పార్టీలో టెబుల్ పైకి ఎక్కి మరి ఖుష్బు డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోను దిశ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ హ్యీప బర్త్‌డే మై క్రేజీ సిస్, నీలా నేను కూడా డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చింది. సల్మాన్, కత్రినా పాటకు ఖష్ఫు తనదైన స్టైల్‌ల్లో స్టెప్పులేసింది ఖష్బు.
చదవండి: షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి?
ఇక ఆమె డ్యాన్స్‌కు కొంతమంది నెటిజన్లు ఫిదా అవుతుండగా మరికొందరూ తమదైన స్టైల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఛీఛీ.. ఒళ్లు మరిచి ఎలా డ్యాన్స్ చేస్తుంది. తనో ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మరించిందా.. తనేమి హీరోయిన్ కాదు.. కొంచం పద్దతిగా ఉండండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఖుష్బూప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. దిశా పటాని ఎప్పుడైతే తన అక్క ఆర్మీ ఆఫీసర్ అని వెల్లడించిందో అప్పటి నుంచి ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఖుష్బూ భారత ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ దిశాలాగే ఫిట్‌నెస్ ప్రియురాలు. ఎప్పటికప్పుడు జిమ్, వర్కౌట్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
చదవండి: హీరోనవుతా, నా పెళ్లికి చిరంజీవి వస్తారు.. విచిత్రంగా అదే జరిగింది: హీరో
Comments
Please login to add a commentAdd a comment