
Disha Patani Workout Gym Video: మెగా హీరో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హాట్ బ్యూటీ దిశా పటానీ. ఆ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. బాలీవుడ్‌లోనే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఎమ్‌ఎస్ ధోనీ, భాగీ సిరీస్ వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు పుకార్లను ఎదుర్కొంటున్న ఈ ఫిట్‌నెస్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ ఫొటోలు, ఫోజులు, వీడియోలతో అభిమానుల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది. ఇటీవల ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
చదవండి: బికినీ ఫొటో అడిగాడు.. హీరోయిన్ రిప్లైకి షాక్ అయ్యాడు
బుధవారం (మార్చి 16) దిశా పటానీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వర్క్ అవుట్ వీడియోను షేర్ చేసింది. సాధారణంగానే దిశా తన అభిమానులకు ఫిట్‌నెస్ గోల్స్, సూచనలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన హాట్ వర్క్ అవుట్ వీడియోను పంచుకుంది. ఈ వీడియోల దిశా తన టోన్డ్ బ్యాక్‌ను చూపిస్తూ జిమ్‌లో వైడ్ గ్రిప్ పుల్ చేస్తూ దర్శనమిచ్చింది. వర్క్ అవుట్ చేస్తున్న దిశా అందం చూసిన అభిమానులు, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కాగా దిశా పటానీ ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన కరణ్ జోహార్ యాక్షన్ డ్రామా 'యోధా' చిత్రీకరణను పూర్తి చేసింది. ఈ ఏడాది ఆమె నటించిన 'ఏక్ విలన్ 2' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్
Comments
Please login to add a commentAdd a comment