
నిజమైన ప్రేమను ఏ రూపంలో వ్యక్తపరిచినా అది ఎదుటివారికి తప్పక చేరుతుంది. ప్రతి పనిలోనూ మనం చూపించే ప్రేమ వారి హృదయాలను తాకుతుంది.. ఆ ప్రేమను పొందే ఆనంద క్షణాలు మాటల్లో వర్ణించలేనివి. సరిగ్గా ఇలాంటి దృశ్యమే ఓ పెళ్లిలో చోటుచేసుకుంది. ఎక్కడ, ఎప్పుడూ జరిగిందో తెలియదు కానీ ఓ వివాహ వేడుకలో వధువు తన ప్రేమను వరుడికి తెలిపి అతన్ని ఆశ్చర్యపరచాలని అనుకుంది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు నేను నీ దాన్ని అనేలా ఓ పాటకు వరుడు ముందు డ్యాన్స్‌చేసింది. సర్దార్ కా గ్రాండ్సన్ సినిమాలోని ‘మెయిన్ తేరి హో గయి’ పాటకు స్టెప్పులేసింది.
చదవండి: ఫ్రెండ్స్‌తో కలిసి స్టెప్పులేసిన వధువు.. వావ్ వాట్ ఏ డ్యాన్స్ అంటున్న నెటిజన్స్!
అయితే వధువు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో వరుడు మెస్మరైజ్ అయ్యాడు. భార్య డ్యాన్స్ చూసిన వరుడు ఎమోషనల్ అయ్యాడు. ఆనందంతో కంటనీరు పెట్టుకున్నాడు. అనంతరం వధువు వుడిని చేయిపట్టుకొని స్టేజ్ మీదకు తీసుకెళ్లి కన్నీళ్లు తుడిచింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వరుడి భావోద్వేగం విలువకట్టలేనిదని.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..!
Comments
Please login to add a commentAdd a comment