ఐష్‌.. పర్పుల్‌ లిప్స్‌పై అమితాబ్‌ కామెంట్స్‌‌!! | Want to know what Big B thought about Aishwarya’s purple lips? | Sakshi
Sakshi News home page

ఐష్‌.. పర్పుల్‌ లిప్స్‌పై అమితాబ్‌ కామెంట్స్‌‌!!

Published Mon, May 30 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

ఐష్‌.. పర్పుల్‌ లిప్స్‌పై అమితాబ్‌ కామెంట్స్‌‌!!

ఐష్‌.. పర్పుల్‌ లిప్స్‌పై అమితాబ్‌ కామెంట్స్‌‌!!

ముంబై: బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ తన కోడలు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ పర్పుల్‌ లిప్స్‌పై ఏమన్నారో తెలుసుకోవాలనుందా? అయితే ఎందుకు మరి ఆలస్యం.. ఇటీవల కేన్స్‌ 69వ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెడ్‌ కార్పెట్‌పై మెరిసిన ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌.. పర్పుల్‌ లిప్స్‌తో మెరిసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఐష్‌ లిప్స్‌ను పొగుడుతూ కామెంట్లు చేయడంతో ఆమె తెగ సంబరపడిపోయిందంట. ఈ విషయంలో మామ అమితాబ్‌ కూడా వారిమాదిరిగానే కోడలినే సమర్థించాడు. అయితే సోషల్‌ మీడియాలో వచ్చిన ఐష్‌ పర్పుల్‌ లిప్‌స్టిక్‌పై వచ్చిన ట్విట్లను తాను చూడలేదంటూనే.. అయినా అందులో తప్పు ఏముందంటూ కోడలని వెనుకేసుకొచ్చాడు. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన అమితాబ్‌.. సోషల్‌ మీడియాపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరచాడు.

ఈ సందర్భంగా అమితాబ్‌ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి సోషల్‌ మీడియా చక్కని అవకాశం కల్పిస్తోంది. మనమేంటో మనకు మాత్రమే తెలుసు, కానీ ఇతరులు, సమాజం మనపట్ల ఎలా స్పందిస్తున్నారో తెలియదు. ఈ సోషల్‌ మీడియా ద్వారే ఎదుటివారు మనపట్ల ఎలా స్పందిస్తున్నారో తెలిసేది అని చెప్పుకొచ్చాడు. ప్రతిరోజు ఏదో ఒక వార్తపై నెటిజన్లు సోషల్‌ మీడియాలో స్పందిస్తూనే ఉంటారు. అలాగే ఐశ్వర్యరాయ్‌ పర్పుల్‌ లిప్స్‌పై కూడా కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలని వ్యక్తపరిచారు. అంతమాత్రానా అది తప్పుగా పరిగణించాల్సిన అవసరం లేదన్నాడు. అయినా ఒక వ్యక్తిపై స్పందన.. అది ఎంత సేపు ఉండదు కూడా. సోషల్‌ మీడియా ప్రతిఒక్కరికి స్పందించే హక్కును కల్పించింది. ఆ అవకాశంతో ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు. అభిప్రాయాలను వ్యక్తపరచడమనేది తప్పేలా అవుతుందని అమితాబ్‌ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement