purple lips
-
రంగులు అద్దిన చిత్రం కాదండోయ్.. ప్రకృతి దిద్దుకున్న మనోహర దృశ్యం
ఇది కాన్వాస్‌పై రంగులు అద్దిన చిత్రం కాదు.. వినీలాకాశంపై ప్రకృతి దిద్దుకున్న ముగ్ధ మనోహర దృశ్యం. దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా వద్ద గులాబీ, ఊదా, నారింజ రంగుల మిశ్రమంతో ఆకాశంపై పరుచుకున్న వర్ణమాలిక. అంటార్కిటికాలోని న్యూజిలాండ్ పరిశోధన కేంద్రం టెక్నీషియన్ స్టువర్ట్ షా ఈ చిత్రాలను క్లిక్‌మనిపించారు. గగనతల రంగుల వెనకున్న కారణం విచిత్రమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది జనవరి 15న అంటార్కిటికాకు సుమారు 7 వేల కిలోమీటర్ల దూరంలోని టోంగా దీవుల్లో ఉన్న సముద్రగర్భ అగ్నిపర్వతం బద్దలై ఏకంగా 58కి.మీ. ఎత్తుకు బూడిద, దుమ్ము, ధూళిని ఎగజిమ్మిందని చెప్పారు. దీంతో భూ వాతావరణంలోనే నేటికీ కలియతిరుగుతున్న ధూళి తుంపరల్లో కొన్ని సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో కాంతిని అడ్డుకున్నప్పుడు ఆకాశంలో ఇలా రంగురంగుల దృశ్యాలు కనిపిస్తాయని వివరించారు. ఇప్పటికే ఇలాంటి దృశ్యాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వద్ద గగనతలంపై కనిపించినట్లు చెప్పారు. ఈ అగ్నిపర్వత ధూళి తుంపరలు సుమారు రెండేళ్లపాటు భూ వాతావరణంలో ఉంటాయని పేర్కొన్నారు. చదవండి: India: అత్యధిక బిలియనీర్లు ఏ రంగం నుంచి ఉన్నారో తెలుసా? The sky over Antarctica turned pink due to the January eruption of the Hunga-Tonga-Hunga-Haapai volcano in the Pacific Ocean. pic.twitter.com/AhPwWv0Gp1 — Spriteer (@spriteer_774400) July 17, 2022 -
ఐష్.. పర్పుల్ లిప్స్‌పై అమితాబ్ కామెంట్స్!!
ముంబై: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ పర్పుల్ లిప్స్‌పై ఏమన్నారో తెలుసుకోవాలనుందా? అయితే ఎందుకు మరి ఆలస్యం.. ఇటీవల కేన్స్ 69వ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై మెరిసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్.. పర్పుల్ లిప్స్‌తో మెరిసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఐష్ లిప్స్‌ను పొగుడుతూ కామెంట్లు చేయడంతో ఆమె తెగ సంబరపడిపోయిందంట. ఈ విషయంలో మామ అమితాబ్ కూడా వారిమాదిరిగానే కోడలినే సమర్థించాడు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఐష్ పర్పుల్ లిప్‌స్టిక్‌పై వచ్చిన ట్విట్లను తాను చూడలేదంటూనే.. అయినా అందులో తప్పు ఏముందంటూ కోడలని వెనుకేసుకొచ్చాడు. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన అమితాబ్.. సోషల్ మీడియాపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరచాడు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి సోషల్ మీడియా చక్కని అవకాశం కల్పిస్తోంది. మనమేంటో మనకు మాత్రమే తెలుసు, కానీ ఇతరులు, సమాజం మనపట్ల ఎలా స్పందిస్తున్నారో తెలియదు. ఈ సోషల్ మీడియా ద్వారే ఎదుటివారు మనపట్ల ఎలా స్పందిస్తున్నారో తెలిసేది అని చెప్పుకొచ్చాడు. ప్రతిరోజు ఏదో ఒక వార్తపై నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉంటారు. అలాగే ఐశ్వర్యరాయ్ పర్పుల్ లిప్స్‌పై కూడా కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలని వ్యక్తపరిచారు. అంతమాత్రానా అది తప్పుగా పరిగణించాల్సిన అవసరం లేదన్నాడు. అయినా ఒక వ్యక్తిపై స్పందన.. అది ఎంత సేపు ఉండదు కూడా. సోషల్ మీడియా ప్రతిఒక్కరికి స్పందించే హక్కును కల్పించింది. ఆ అవకాశంతో ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు. అభిప్రాయాలను వ్యక్తపరచడమనేది తప్పేలా అవుతుందని అమితాబ్ అభిప్రాయపడ్డాడు. -
ఆమె గురించే అంతా మాట్లాడుకోవాలని..
వంకాయ (పర్పుల్) రంగు లిప్‌స్టిక్ పెదాలకు పూసుకొని కాన్స్ చిత్రోత్సవంలో అందరినీ షాక్‌కు గురిచేసింది బాలీవుడ్ సుందరి ఐశ్వర్యరాయ్. ఆమె లిప్‌స్టిక్ గురించి ట్విట్టర్లో పెద్ద ఎత్తున సెటైర్లు వచ్చాయి. కొందరు నచ్చిందన్నారు. కొందరు మూతితిప్పారు. మొత్తానికి పెదాలకు రాసుకున్న లిప్ట్స్టిక్తోనూ ఐష్ ఫ్యాషన్ రంగంలో పెద్ద చర్చను లేవనెత్తింది. దీనిపై తాజాగా 'నీర్జా' హీరోయిన్ సోనం కపూర్ ఒకింత చిత్రంగా స్పందించింది. అందరూ తన గురించే మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనే ఐష్ తన అధరాలకు వంకాయ రంగు లిప్‌స్టిక్ పూసుకొని ఉంటుందని సోనం చెప్పుకొచ్చింది. కాన్స్ చిత్రోత్సవంలో 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ వినూత్న ఫ్యాషన్‌తో ఐష్ ఇంతగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడం తనకు ఆనందం కలిగించిందని సోనం చెప్పింది. 'ఫ్యాషన్, మేకప్ అనేవి వాటిని చూసి నలుగురు చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఉంటాయి. ఆమె కూడా తన గురించి చర్చించాలనుకొని ఉంటుందని నేను భావిస్తున్నా. ఆమె దానిని సాధించింది. నిజానికిది గొప్ప విషయం' అంటూ సెలవిచ్చింది. లోరియల్ బ్రాండ్ కోసమే తాను పర్పుల్ లిప్‌స్టిక్ పెట్టుకున్నట్టు ఐష్ చెప్పగా.. సోనం మాత్రం అదేమీ కాదు.. ఆమె డ్రెస్ మీద అమూల్ యాడ్ ఉందని, కాబట్టి అది ఐష్ చాయిసే అయి ఉంటుందని వివరించింది.