ఆమె గురించే అంతా మాట్లాడుకోవాలని.. | Aishwarya wanted to be talked about, says Sonam Kapoor on her purple lips | Sakshi
Sakshi News home page

ఆమె గురించే అంతా మాట్లాడుకోవాలని..

Published Wed, May 25 2016 6:02 PM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

ఆమె గురించే అంతా మాట్లాడుకోవాలని..

ఆమె గురించే అంతా మాట్లాడుకోవాలని..

వంకాయ (పర్పుల్‌) రంగు లిప్‌స్టిక్‌ పెదాలకు పూసుకొని కాన్స్‌ చిత్రోత్సవంలో అందరినీ షాక్‌కు గురిచేసింది బాలీవుడ్ సుందరి ఐశ్వర్యరాయ్‌. ఆమె లిప్‌స్టిక్‌ గురించి ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున సెటైర్లు వచ్చాయి. కొందరు నచ్చిందన్నారు. కొందరు మూతితిప్పారు. మొత్తానికి పెదాలకు రాసుకున్న లిప్ట్‌స్టిక్‌తోనూ ఐష్‌ ఫ్యాషన్‌ రంగంలో పెద్ద చర్చను లేవనెత్తింది. దీనిపై తాజాగా 'నీర్జా' హీరోయిన్‌ సోనం కపూర్ ఒకింత చిత్రంగా స్పందించింది. అందరూ తన గురించే మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనే ఐష్‌ తన అధరాలకు వంకాయ రంగు లిప్‌స్టిక్ పూసుకొని ఉంటుందని సోనం చెప్పుకొచ్చింది.

కాన్స్‌  చిత్రోత్సవంలో 15 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ వినూత్న ఫ్యాషన్‌తో ఐష్‌ ఇంతగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడం తనకు ఆనందం కలిగించిందని సోనం చెప్పింది. 'ఫ్యాషన్‌, మేకప్‌ అనేవి వాటిని చూసి నలుగురు చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఉంటాయి. ఆమె కూడా తన గురించి చర్చించాలనుకొని ఉంటుందని నేను భావిస్తున్నా. ఆమె దానిని సాధించింది. నిజానికిది గొప్ప విషయం' అంటూ సెలవిచ్చింది. లోరియల్‌ బ్రాండ్‌ కోసమే తాను పర్పుల్ లిప్‌స్టిక్ పెట్టుకున్నట్టు ఐష్‌ చెప్పగా.. సోనం మాత్రం అదేమీ కాదు.. ఆమె డ్రెస్‌ మీద అమూల్ యాడ్‌ ఉందని, కాబట్టి అది ఐష్‌ చాయిసే అయి ఉంటుందని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement