
ముంబై :
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ ఫోటోగ్రాఫర్‌ను పిలిచి కెమెరాలోని ఫోటోలను చూపించమని అడిగిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో కలిసి మనీశ్ మల్హోత్రా ఇచ్చిన డిన్నర్ పార్టీకి హాజరయ్యారు. ఐష్‌కు మల్హోత్రా మంచి స్నేహితుడే కాకుండా తన తదుపరి చిత్రం ఫన్నె ఖాన్ చిత్రానికి కూడా డిజైనర్‌గా ఉన్నాడు. మల్హోత్రా ఇచ్చిన పార్టీకి దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కూడా వెళ్లాడు.
అయితే పార్టీ అనంతరం ఇంటికి వెళ్లడానికి అభిషేక్ తన కారును మల్హోత్రా ఇంటి బయటకు తీసుకొచ్చి ఐష్ కోసం ఆపాడు. ఐష్‌కు తోడుగా మల్హోత్రా కారు వరకు వచ్చాడు. ఐష్ కనిపించగానే అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్‌లు క్లిక్కుల మీద క్లిక్కులు కొట్టేశారు. అయితే ఐష్ కారులో కూర్చునే సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్ పొట్టిగా ఉండటంతో ఏమైనా అసభ్యంగా కనిపించే అవకాశం ఉందని గ్రహించిన అభిషేక్ ఓ ఫోటోగ్రాఫర్‌ను సైగలతో రమ్మని పిలిచాడు. ఐష్ అసభ్యంగా కనిపించేలా ఏమైనా ఫోటోలు తీసావా అని అడిగి అంతటితో ఆగకుండా కెమెరాలో తీసిన ఫోటోలను చూపించమని వాటిని చూసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భార్య మీద అభిషేక్కు ఎంతో ప్రేమో అంటూ.. ఈ వీడియో చూసిన వాళ్లందరూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.
2016లో వచ్చిన ఏ దిల్ హే ముష్కిల్ చిత్రం తర్వాత ప్రస్తుతం ఐష్ ఫన్నె ఖాన్‌లో నటిస్తోంది. అనిల్ కపూర్, ఐశ్వర్య రాయ్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రలో ఫన్నె ఖాన్ రూపుదిద్దుకుంటోంది. ఐష్ రాజ్‌కుమార్ ప్రేమికులుగా కనిపించనున్నారు. ఎవ్రిబడీస్ ఫేమస్ అనే డచ్ చిత్రాకి ఇది రీమేక్. అతుల్ మంజ్రేకర్ డెబ్యూ డైరెక్షన్‌లో ఇది తెరకెక్కుతోంది. అభిషేక్ బచ్చన్ చివరిగా హౌస్ ఫుల్ 3 చిత్రంలో నటించారు. సంజయ్ లీలా బన్సాలీ తదుపరి చిత్రంలో నటించనున్నట్టు సమాచారం.
ఫోటోగ్రాఫర్‌ను పిలిచి ఫోటోలను చూసిన అభిషేక్ వీడియో