భవిష్యత్‌లో నా డైరెక్షన్‌ మారుతుంది | Aishwarya Rai Bachchan to turn director a few years | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌లో నా డైరెక్షన్‌ మారుతుంది

Published Sat, Aug 4 2018 1:27 AM | Last Updated on Mon, Aug 20 2018 2:14 PM

Aishwarya Rai Bachchan to turn director a few years - Sakshi

ఐశ్యర్యా రాయ్‌

కెమెరా.. రోలింగ్‌.. యాక్షన్‌ అని డైరెక్టర్‌ అనగానే చేసే పాత్రలోకి ఒదిగిపోతారు కథానాయిక ఐశ్యర్యా రాయ్‌. కెమెరా ముందు ఎన్నో పాత్రల్లో నటిస్తూ 20 సంవత్సరాలుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారామె. కానీ ఇప్పుడు కెమెరా వెనక వర్క్‌ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఐశ్వర్య డైరెక్టర్‌గా మారాలనుకుంటున్నారు. ఐశ్వర్యా రాయ్‌ నటించిన తాజా చిత్రం ‘ఫ్యానీఖాన్‌’ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఐశ్యర్య మాట్లాడుతూ– ‘‘డైరెక్షన్‌ వైపు ఇంట్రెస్ట్‌ ఉంది.

భవిష్యత్‌లో తప్పకుండా డైరెక్టర్‌ అవుతాను. ఏదో డైరెక్షన్‌ చేయాలనే ఆశతో సినిమా చేయను. పూర్తి మనసు పెట్టి చేస్తాను. ఆ మాటకొస్తే.. ఏ పనినైనా నేను హార్ట్‌ఫుల్‌గానే చేస్తా. నేను డైరెక్టర్‌ అవ్వాలనుకుంటున్న విషయాన్ని నా డైరెక్టర్స్‌కి, తోటి యాక్టర్స్‌కి చెప్పినప్పుడు ‘ఓకే ఓకే’  అని సరదాగా ఆటపట్టిస్తున్నారు. నా భర్త అభిషేక్‌ బచ్చన్‌ ‘నువ్వు చేయగలవు’ అంటున్నాడు’’ అని పేర్కొన్నారు ఐశ్వర్యా రాయ్‌. ఇదిలా ఉంటే.. నెక్ట్స్‌ తన భర్త అభిషేక్‌ బచ్చన్‌తో కలసి ఐశ్వర్యా రాయ్‌ నటించనున్న చిత్రం త్వరలో ఆరంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement