Fanney Khan
-
భారత బిగ్గెస్ట్ సీఈవోలు వారే : ఐశ్వర్య రాయ్
న్యూఢిల్లీ : 'హౌజ్ వైఫ్' అనే పదం వినడానికి ఎంత తేలికగా ఉన్నా... ఆ బాధ్యతలు నిర్వర్తించడం ఎంత కష్టమో ప్రతి ఒక్క అమ్మాయికి తెలిసే ఉంటుంది. ఇంటి బాధ్యతల్ని ఎప్పడికప్పుడూ నెరవేరుస్తూ.. పిల్లలకు, భర్తకు, అత్తామామలకు ఎలాంటి లోటు రాకుండా రేయింబవళ్లు కష్టపడాల్సి ఉంటుంది. చాలా మంది మగాళ్లు హౌజ్ వైఫేగా అంటూ తేల్చి పడేస్తూ ఉంటారు. కానీ వారే కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరించే కంటే ఎక్కువ బాధ్యతలు వ్యవహరిస్తారట. తాజాగా ఈ విషయాన్ని ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఒప్పుకున్నారు. భారత్‌లో అతిపెద్ద సీఈవోలు హౌజ్ వైఫ్‌లేనని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. తన తాజా సినిమా ఫన్నీ ఖాన్ ప్రమోట్ చేసుకోవడానికి ఓ డ్యాన్స్ షోలో పాల్గొన ఆమె ఈ ప్రకటన చేశారు. ‘హౌజ్ వైఫ్‌లే భారత్‌లో అతిపెద్ద సీఈవోలు. వారికి మనం అత్యంత ఉన్నతమైన గౌరవం, ప్రశంస ఇవ్వాలి. మన దేశంలో, ప్రపంచంలో ఉన్న హౌజ్ వైఫ్‌లందరికీ ఎంతో గౌరవంతో, ప్రశంసతో చేతులెత్తి నమస్కరిస్తున్నా’ అని తెలిపారు. ఐశ్వర్య రాయ్ చేసిన ఈ ప్రకటనకు, సింగర్ విశాల్ డాడ్లని కూడా మద్దతిచ్చారు. ఆ డ్యాన్స్ షోలో ఆయన కూడా జడ్జి. ఐశ్వర్య రాయ్ కూడా మిగతా హౌజ్‌వైఫ్‌ల మాదిరి ప్రపంచంలో అత్యంత సుందరమైన మహిళల్లో ఒకరు అని విశాల్ కొనియాడారు. ‘నా మ్యూజిక్ టూర్ల సమయంలో ఒకసారి అమితాబ్ జీ మమ్మల్ని డిన్నర్ పార్టీకి ఆహ్వానించారు. ప్రపంచంలో అత్యంత సుందరి అయిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆమె స్వహస్థాలతో మాకు డిన్నర్ వడ్డించింది. ఆ పార్టీకి సిబ్బంది అంతా వెళ్లాం. ప్రతి ఒక్కరికీ ఆమెనే సర్వ్ చేసింది. మేము అందరం తిన్న తర్వాతనే, ఐశ్వర్య భోజనం చేసింది’ అని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఐశ్వర్య తన వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల తన ఆరేళ్ల కూతురు ఆరాధ్యతో కలిసి పారిస్ ట్రిపులో పాల్గొనడమే. ఐశ్వర్య వర్క్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, తన కూతురు కోసం కూడా కాస్త సమయాన్ని వెచ్చిస్తూ.. ఆరాధ్యతో కలిసి ఈఫిల్ టవర్, డిస్నీల్యాండ్ సందర్శించారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి కూడా. 2007లో ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 20న ఈ కపుల్ తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. తన లేటెస్ట్ మూవీ ఫన్నీ ఖాన్ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నెక్ట్స్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలసి ఐశ్వర్యా రాయ్ నటించబోతున్నారు. -
భవిష్యత్‌లో నా డైరెక్షన్ మారుతుంది
కెమెరా.. రోలింగ్.. యాక్షన్ అని డైరెక్టర్ అనగానే చేసే పాత్రలోకి ఒదిగిపోతారు కథానాయిక ఐశ్యర్యా రాయ్. కెమెరా ముందు ఎన్నో పాత్రల్లో నటిస్తూ 20 సంవత్సరాలుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారామె. కానీ ఇప్పుడు కెమెరా వెనక వర్క్ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఐశ్వర్య డైరెక్టర్‌గా మారాలనుకుంటున్నారు. ఐశ్వర్యా రాయ్ నటించిన తాజా చిత్రం ‘ఫ్యానీఖాన్’ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఐశ్యర్య మాట్లాడుతూ– ‘‘డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ ఉంది. భవిష్యత్‌లో తప్పకుండా డైరెక్టర్ అవుతాను. ఏదో డైరెక్షన్ చేయాలనే ఆశతో సినిమా చేయను. పూర్తి మనసు పెట్టి చేస్తాను. ఆ మాటకొస్తే.. ఏ పనినైనా నేను హార్ట్ఫుల్గానే చేస్తా. నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న విషయాన్ని నా డైరెక్టర్స్‌కి, తోటి యాక్టర్స్‌కి చెప్పినప్పుడు ‘ఓకే ఓకే’ అని సరదాగా ఆటపట్టిస్తున్నారు. నా భర్త అభిషేక్ బచ్చన్ ‘నువ్వు చేయగలవు’ అంటున్నాడు’’ అని పేర్కొన్నారు ఐశ్వర్యా రాయ్. ఇదిలా ఉంటే.. నెక్ట్స్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలసి ఐశ్వర్యా రాయ్ నటించనున్న చిత్రం త్వరలో ఆరంభం కానుంది. -
‘ఫన్నే ఖాన్’ టీజర్ రిలీజ్
-
అన్నీ తానై!
ప్రతిభకు కష్టం తోడైతే గెలుపు మార్గం కనిపిస్తుంది. ఆ గెలుపు మార్గంలో వెళ్తున్న ఓ యంగ్ టాలెంటెడ్ టీనేజ్ సింగర్‌ని కొందరు మాటలతో ఓడించాలని ట్రై చేశారు. ఫైనల్లీ ఆ అమ్మాయే గెలిచింది. కానీ ఈ గెలుపులో ఐశ్యర్యారాయ్ ఆ అమ్మాయికి అన్నీ తానై అండగా నిలబడి, అభయమిచ్చారు. హిందీ చిత్రం ‘ఫ్యాన్నీఖాన్’ కథ ఇలానే ఉండబోతుందని బీటౌన్ టాక్. ఐశ్యర్యారాయ్, అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావ్, దివ్య ముఖ్యతారలుగా నటిస్తోన్న చిత్రం ‘ఫ్యాన్నీఖాన్’. ఈ సినిమాలో సింగర్ పాత్రలో ఐశ్యర్యారాయ్ బచ్చన్ కనిపించనున్నారు. ట్యాక్సీ డ్రైవర్‌గా అనిల్‌కపూర్ కనిపించనున్నారట. సినిమాలో అనిల్ కపూర్‌కి ఓ కూతురు ఉంటుంది. తను టాలెంటెడ్ సింగర్. సీనియర్ సింగర్ అయిన ఐశ్యర్య ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తారట. అదెలా అనేది స్క్రీన్‌పై చూడాల్సిందే. ఈ సినిమాలో ఐశ్యర్య లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది రంజాన్‌కు ‘ఫ్యాన్నీఖాన్’ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ సల్మాన్ ‘రేస్ 3’తో రంజాన్‌కు రెడీగా ఉన్నారు. మరి.. సల్మాన్ వర్సెస్ ఐశ్యర్యలో ఎవరు వెనక్కి తగ్గుతారన్న చర్చ బాలీవుడ్లో జరుగుతోంది. -
పోటీకి సై!
ఆల్మోస్ట్ 15 ఏళ్ల క్రితం లవ్‌లో ఉన్న కండల వీరుడు సల్మాన్‌ఖాన్, అందాల భామ ఐశ్యర్యా రాయ్ ఏవో రీజన్స్ వల్ల బ్రేకప్ చెప్పుకున్నారని బాలీవుడ్ కథనాలు చదివాం. ఆ తర్వాత 2007లో అభిషేక్ బచ్చన్‌ను ఐశ్యర్య వివాహం చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సల్మాన్, ఐశ్యర్యల మధ్య వార్ మొదలైంది. ఏవేవో ఊహించుకోకండి. వార్ పర్సనల్‌గా కాదు. ప్రొఫెషనల్‌గా. వీరిద్దరూ వచ్చే ఏడాది బాక్సాఫీస్ వార్కి సై అంటున్నారు. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఐశ్యర్యా రాయ్ లీడ్ రోల్లో ‘ఫ్యాన్నీ ఖాన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనీల్‌కపూర్, రాజ్‌కుమార్ రావు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ చేయనున్నట్లు ఈ సినిమా నిర్మాతలు అర్జున్ ఎన్.కపూర్, ప్రీమా అరోరా, భూషన్ కుమార్, రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తెలిపారు. ఈ పండగకే రావడానికి రెడీ అవుతున్నట్లు ఆ మధ్య సల్మాన్ ఖాన్ ‘రేస్ 3’ బృందం ప్రకటించింది. సల్లూభాయ్‌కి బాక్సాఫీసు దగ్గర అచ్చొచ్చిన పండగ రంజాన్. ఒక్క 2013 మినహాయించి 2009 నుంచి మొన్నీ మధ్య 2017 వరకు ప్రతి రంజాన్ పండక్కి సల్మాన్ సినిమా వచ్చింది. ‘వాంటెడ్, దబాంగ్, బాడీగార్డ్, ఎక్ థా టైగర్, కిక్, భజరంగీ భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్‌లైట్ (2017)’ సినిమాలు రంజాన్‌కు విడుదలైనవే. 2018 మిస్సవుతుందని అనుకున్నారు. ఎందుకంటే సల్మాన్ ‘భరత్’ సినిమాను 2019లో రంజాన్‌కు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రదర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ప్రకటించారు. సో...∙2018 రంజాన్‌కి సల్లుభాయ్ సినిమా లేనట్లే అని ఫిక్సవుతున్న తరుణంలో ఈ కండల వీరుడు హీరోగా రూపొందుతోన్న ‘రేస్ 3’ సినిమాను రంజాన్‌కు రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు రెమో డిసౌజా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 9న మొదలైంది. ఒకవైపు కలసి వచ్చిన పండక్కి రావడానికి సల్మాన్ రెడీ అవుతోంటే, ఐశ్వర్యా రాయ్ ‘ఫ్యానీ ఖాన్’తో రేస్‌లో నిలబడ్డారు. మరి... ఎక్స్ లవర్స్‌లో గెలుపు ఎవరిది? వేచి చూద్దాం. -
కొత్త సినిమా షూటింగ్లో ప్రమాదం
ముంబై : బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కొత్త చిత్రం ఫన్నె ఖాన్ సెట్స్‌లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ గాయపడినట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర మేకర్లు ఓ ప్రటన విడుదల చేశారు. ‘‘ఓ మోటర్ సైకిల్ బలంగా ఢీ కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించాం. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేశాం’’ అని ప్రకటనలో ఉంది. కాగా, ఐష్ పై ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఆమె(అసిస్టెంట్ డైరెక్టర్) చెవిలో వాకీ టాకీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రోడ్డు దాటుతున్న క్రమంలో బైక్ వచ్చిన విషయాన్ని గుర్తించలేకపోయారని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే త్వరలోనే ఆమె తిరిగి షూటింగ్లో పాల్గొంటుందని మేకర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అనిల్ కపూర్, ఐశ్వర్య రాయ్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రలో ఫన్నె ఖాన్ రూపుదిద్దుకుంటోంది. ఐష్ రాజ్‌కుమార్ ప్రేమికులుగా కనిపించనున్నారు. ఎవ్రిబడీస్ ఫేమస్ అనే డచ్ చిత్రాకి ఇది రీమేక్. అతుల్ మంజ్రేకర్ డెబ్యూ డైరెక్షన్లో ఇది తెరకెక్కుతోంది. -
అత్తమామలు మండిపడతారని...
ముంబై : ‘బచ్చన్ ఇంటి కోడలు ఇలాంటి సీన్స్‌లో నటిస్తే బాగుంటుందా? హద్దులు దాటకుండా ఉండాల్సింది’... హిందీ చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’ లో హీరో రణబీర్ కపూర్‌తో హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ నటించిన రొమాంటిక్ సీన్స్ చూసి, చాలామంది ఇలానే అభిప్రాయపడ్డారు. ఐష్ అత్తమామలు జయా, అమితాబ్ బచ్చన్ కూడా అలానే ఫీలయ్యారట. ఆ సినిమా విడుదలకు ముందు అమితాబ్ ఇన్వాల్వ్ అయి, కొన్ని సీన్స్ తీయించేశారనే వార్త కూడా ప్రచారమైంది. అత్తమామలు ఐష్ మీద బాగా మండిపడ్డారని కూడా ఓ వార్త షికారు చేసింది. దాంతో ఇక, భవిష్యత్తులో ఇలాంటిది జరగకూడదని ఐష్ భావించారట. అందుకే, తాజా చిత్రం ‘ఫాన్నీ ఖాన్’లో హీరో రాజ్‌కుమార్ రావ్‌తో రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి వెనకాడారని సమాచారం. చిత్రదర్శకుడు అతుల్ మంజ్రేకర్ ఆ విషయంలో ఆగ్రహం చెందినా బచ్చన్ ఇంటి కోడలు కావడంతో ఏమీ అనలేక సర్దుకుపోతున్నారట. ‘‘చేసే ప్రతి సీన్ విషయంలోనూ ఐశ్వర్యా రాయ్ కేర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌కి నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేస్తున్నారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అత్తామామలను నొప్పించే బదులు ‘నో’ చెప్పేస్తే బెటర్ అని ఐష్ ఫిక్స్ అయినట్లున్నారు. -
40కి 30తో కుదిరింది!
ఐశ్వర్యారాయ్ వయసెంత? అని అడిగితే.. థర్టీ ప్లస్ ఉంటాయేమో అంటారు. కానీ, ఈ అందాల సుందరి ఫార్టీ ప్లస్‌లో ఉన్నారు. వయసు తెలియనివ్వకుండా ఫిజిక్‌ని మెయిన్టైన్ చేస్తున్నారామె. అందుకేనేమో ఆమెకన్నా దాదాపు పదేళ్లు తక్కువ వయసున్న హీరోకి జోడీగా ఐష్‌ను తీసుకున్నారు దర్శకుడు అతుల్ మంజ్రేకర్. నిజానికి ఈ సినిమాలో ఫిఫ్టీ ప్లస్ హీరో అనిల్‌కపూర్ సరసన ఐష్ నటిస్తారనే వార్త వినిపించింది. ఆ తర్వాత ఆమె వయసుకు దాదాపు సమాన వయస్కుడైన మాధవన్‌తో జతకడతారనే వార్త వచ్చింది. చివరికి ఆ అవకాశం థర్టీ ప్లస్ ఏజ్ హీరో రాజ్‌కుమార్ రావ్‌కి దక్కింది. ‘‘ఈ సినిమా షూట్‌కు సంబంధించిన వర్క్స్ ముంబైలో స్టార్టయ్యాయి. ముందు అనిల్ కపూర్‌పై కొన్ని సీన్స్‌ను తీసిన తర్వాత ఐశ్యర్య షూట్లో జాయిన్ అవుతారు. ఈ చిత్రంలో ఐశ్యర్య హైలీ స్టైలిష్ పాత్రలో కనిపించనున్నారు’’ అని నిర్మాతల్లో ఒకరైన ప్రేరణా అరోరా తెలిపారు. ఇంతకీ ఈ సినిమా పేరు చెప్పలేదు కదూ.. ‘ఫాన్నీ ఖాన్’.