ముంబై : ‘బచ్చన్ ఇంటి కోడలు ఇలాంటి సీన్స్‌లో నటిస్తే బాగుంటుందా? హద్దులు దాటకుండా ఉండాల్సింది’... హిందీ చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’ లో హీరో రణబీర్ కపూర్‌తో హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ నటించిన రొమాంటిక్ సీన్స్ చూసి, చాలామంది ఇలానే అభిప్రాయపడ్డారు. ఐష్ అత్తమామలు జయా, అమితాబ్ బచ్చన్ కూడా అలానే ఫీలయ్యారట. ఆ సినిమా విడుదలకు ముందు అమితాబ్ ఇన్‌వాల్వ్ అయి, కొన్ని సీన్స్ తీయించేశారనే వార్త కూడా ప్రచారమైంది. అత్తమామలు ఐష్ మీద బాగా మండిపడ్డారని కూడా ఓ వార్త షికారు చేసింది.
దాంతో ఇక, భవిష్యత్తులో ఇలాంటిది జరగకూడదని ఐష్ భావించారట. అందుకే, తాజా చిత్రం ‘ఫాన్నీ ఖాన్’లో హీరో రాజ్‌కుమార్ రావ్‌తో రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి వెనకాడారని సమాచారం. చిత్రదర్శకుడు అతుల్ మంజ్రేకర్ ఆ విషయంలో ఆగ్రహం చెందినా బచ్చన్ ఇంటి కోడలు కావడంతో ఏమీ అనలేక సర్దుకుపోతున్నారట. ‘‘చేసే ప్రతి సీన్ విషయంలోనూ ఐశ్వర్యా రాయ్ కేర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌కి నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేస్తున్నారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అత్తామామలను నొప్పించే బదులు ‘నో’ చెప్పేస్తే బెటర్ అని ఐష్ ఫిక్స్ అయినట్లున్నారు.
అత్తమామలు మండిపడతారని...
Published Sat, Sep 23 2017 12:14 AM | Last Updated on Sat, Sep 23 2017 2:04 AM
Advertisement
Advertisement