40కి 30తో కుదిరింది! | Rajkummar Rao to romance Aishwarya Rai Bachchan in Fanney Khan. Here's what he says | Sakshi
Sakshi News home page

40కి 30తో కుదిరింది!

Published Thu, Aug 31 2017 11:32 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

40కి 30తో కుదిరింది!

40కి 30తో కుదిరింది!

ఐశ్వర్యారాయ్‌ వయసెంత? అని అడిగితే.. థర్టీ ప్లస్‌ ఉంటాయేమో అంటారు. కానీ, ఈ అందాల సుందరి ఫార్టీ ప్లస్‌లో ఉన్నారు. వయసు తెలియనివ్వకుండా ఫిజిక్‌ని మెయిన్‌టైన్‌ చేస్తున్నారామె. అందుకేనేమో ఆమెకన్నా దాదాపు పదేళ్లు తక్కువ వయసున్న హీరోకి జోడీగా ఐష్‌ను తీసుకున్నారు దర్శకుడు అతుల్‌ మంజ్రేకర్‌. నిజానికి ఈ సినిమాలో ఫిఫ్టీ ప్లస్‌ హీరో అనిల్‌కపూర్‌ సరసన ఐష్‌ నటిస్తారనే వార్త వినిపించింది. ఆ తర్వాత ఆమె వయసుకు దాదాపు సమాన వయస్కుడైన మాధవన్‌తో జతకడతారనే వార్త వచ్చింది.

 చివరికి ఆ అవకాశం థర్టీ ప్లస్‌ ఏజ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావ్‌కి దక్కింది. ‘‘ఈ సినిమా షూట్‌కు సంబంధించిన వర్క్స్‌ ముంబైలో స్టార్టయ్యాయి. ముందు అనిల్‌ కపూర్‌పై కొన్ని సీన్స్‌ను తీసిన తర్వాత ఐశ్యర్య షూట్‌లో జాయిన్‌ అవుతారు. ఈ చిత్రంలో ఐశ్యర్య హైలీ స్టైలిష్‌ పాత్రలో కనిపించనున్నారు’’ అని నిర్మాతల్లో ఒకరైన ప్రేరణా అరోరా తెలిపారు. ఇంతకీ ఈ సినిమా పేరు చెప్పలేదు కదూ.. ‘ఫాన్నీ ఖాన్‌’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement