ఐశ్వర్య నో అనలేదు | i didn't said no to p vasu movie : aishwarya rai | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య నో అనలేదు

Published Thu, Feb 20 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

ఐశ్వర్య నో అనలేదు

ఐశ్వర్య నో అనలేదు

 మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా పి.వాసు దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ కథా చిత్రం రూపొందనుందన్న వార్తను దర్శక వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఐశ్వర్యారాయ్ సాహస నారిగా నటించనున్న ఈ చిత్రానికి ఐశ్వర్యారాయుం ఆయిరం కాక్కవుమ్ అనే పేరును కూడా ఖరారు చేశారు. తమిళం, తెలుగు, భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో హీరోగా నటించేందుకు ఇద్దరు ప్రముఖ హీరోలతో చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. బిడ్డకు తల్లి అయిన తరువాత ఐశ్వర్యారాయ్ నటించనున్న తొలి చిత్రం ఇదే అవుతుండడంతో ఈ వార్త పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే ఐశ్వర్య తరపున ఈ వార్తలో నిజంలేదని ప్రకటించడం విశేషం.
 
  ఆమె మేనేజర్ ఈ విషయంపై స్పందిస్తూ ఐశ్వర్యారాయ్ మళ్లీ నటించాలని చాలా మంది చిత్రప్రముఖులు కోరుకుంటున్నారన్నారు. చాలా మంది చాలా కథలు చెబుతున్నారని ఐశ్వర్యారాయ్ కూడా పలు కథలు వింటున్నారని, అయితే ఆమె ఎవరికీ నటిస్తానని మాట ఇవ్వలేదని పేర్కొన్నట్లు తమిళ పత్రికల్లో కథనాలు ప్రచారం అయ్యాయి. ఈ విషయంపై పి.వాసు స్పందిస్తూ తాను ఐశ్వర్యా రాయ్‌కు కథ చెప్పిన మాట నిజమన్నారు. ఆమె ఈ చిత్రంలో నటించనుండటం నిజమేనన్నారు. పి.వాసు చిత్రంలో నటించడానికి ఐశ్వర్యారాయ్ నో చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement