ఇద్దరు హాట్ స్టార్స్తో నటించనున్న ఐష్ | Aishwarya rai to feature in a multi-starrer project | Sakshi
Sakshi News home page

ఇద్దరు హాట్ స్టార్స్తో నటించనున్న ఐష్

Published Tue, Dec 29 2015 3:23 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఇద్దరు హాట్ స్టార్స్తో నటించనున్న ఐష్ - Sakshi

ఇద్దరు హాట్ స్టార్స్తో నటించనున్న ఐష్

కూతురు పుట్టిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ 'జజ్బా' తో బాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది.

ముంబై: కూతురు పుట్టిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ 'జజ్బా' తో బాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది. 'సరబ్‌జిత్', 'ఏ దిల్ హే ముష్కిల్' సినిమాల షూటింగ్లతో  ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న ఈ బ్యూటీ మల్టీస్టారర్ మూవీలో కనిపించనుందని సినీవర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్‌లో ఖైదు అయ్యి, అక్కడే చనిపోయిన దేశానికి చెందిన సరబ్‌జిత్ జీవితం ఆధారంగా 'సరబ్‌జిత్' రూపొందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్‌గా ఐశ్వర్య నటిస్తున్నారు. ఈ రెండు మూవీల తర్వాత కొత్త ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రెండు మూవీల తర్వాత ఆమె ప్రాజెక్టు మల్టీ స్టారర్ మూవీ అని, ఇందులో బాలీవుడ్ అగ్రనటులు ఇద్దరు కనిపిస్తారట. అయితే, ఐశ్వర్యతో కలిసి ఇద్దరు హాట్ స్టార్స్ ఇందులో నటిస్తారని ఫిల్మ్ ఇండస్ట్రీలో వదంతులు వినిసిస్తున్నాయి. ఈ తాజా మూవీ వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ.. కొత్త మూవీలో నటించేందుకు ఐష్ చాలా సంతోషంగా ఉందని చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ముగ్గురు స్టార్ నటీనటులు ఇందులో కీలకపాత్ర పోషించనున్నారని, త్వరలో ఆ మూవీ షూటింగ్ మొదలవుతుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement