షూటింగ్లో గాయపడిన ఐశ్వర్య | Aishwarya Rai Bachchan gets injured while shooting | Sakshi
Sakshi News home page

షూటింగ్లో గాయపడిన ఐశ్వర్య

Published Fri, Apr 8 2016 10:49 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

షూటింగ్లో గాయపడిన ఐశ్వర్య

షూటింగ్లో గాయపడిన ఐశ్వర్య

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్  బచ్చన్ షూటింగ్ లో గాయపడినట్టు తెలుస్తోంది. పంజాబ్ లోని ఒక గ్రామంలో జరుగుతున్న తాజా   చిత్రం లోని  ఒక సన్నివేశం కోసం షూట్ చేస్తున్నప్పుడు  ఆమె కాలు  జారిపడినట్టు తెలుస్తోంది. ఈ సన్నివేశంలో ఆమె గతుకుల రోడ్డుపై పరిగెట్టాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె కాలు స్లిప్ అయినట్టు సమాచారం.   

నటీనటులు తరచుగా షూటింగ్ సమయాల్లో గాయాల పాలవ్వడం మామూలే. అయితే వాటిని పెద్దగా లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొనే విషయం తెలిసిందే. ఐష్ కూడా అలాగే చేసిందట.  కాలు స్లిప్ అయిన సందర్భంగా ఆమె సాండిల్ విరిగిపోయింది. దీంతో వేరే చెప్పుల జత కోసం ఎదురు చూడకుండా.. చెప్పులు లేకుండానే పరిగెత్తి ఆ సీన్  షూటింగ్ ను పూర్తి చేసిందట. కాగా షూటింగ్ కు ఆటంకం కలగకుండా ఐశ్వర్య సహకరించారని చిత్ర యూనిట్  సభ్యులు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పందించడానికి ఈ మాజీ విశ్వ సుందరి అందుబాటులో లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement