ప్రపంచ మాజీ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కంటతడి పెట్టారు. ముంబైలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఐశ్వర్య, జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో చాలా ఉద్వేగానికి గురయ్యారు. జాతీయ గీతం పాడుతూనే, ఎంతో గర్వకారకంగా ఫీలై కంటతడి పెట్టేశారు. జాతీయ గీతం ఆలపన చివరిలో ఉబికి వస్తున్న తన కన్నీళ్లను ఎవరూ చూడకుండా తుడుచుకున్నారు. కానీ అప్పటికే ఐష్ పెట్టిన కన్నీళ్లు మీడియా కంట పడ్డాయి.