
చిరూతో ఐష్!
జస్ట్ రెండంటే రెండే. గత పదిహేనేళ్లలో కథానాయికగా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేసిన సౌత్ సినిమాలు. ఆ రెండూ కూడా తమిళ సినిమాలే. ఓ సినిమా ‘రోబో’లో రజనీకాంత్ హీరో. దానికి శంకర్ దర్శకుడు. మరో సినిమా ‘రావణ్’ (తెలుగులో ‘విలన్’)కు మణిరత్నం దర్శకుడు. సౌత్ సినిమాల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్న ఐశ్వర్యను చిరంజీవికి జోడీగా తీసుకోవాలను కుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా రూపొంద నున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో చిరు సరసన ఐశ్వర్య జంటగా నటించడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నాగార్జున ‘రావోయి చందమామ’లో ఐశ్వర ఓ ఐటమ్ సాంగ్ చేశారు. ఆ తర్వాత స్ట్రయిట్ తెలుగు సిన్మా చేయలేదు. ఇప్పుడీ సినిమాకు సైన్ చేస్తే హీరోయిన్‌గా ఆమె చేసే ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు మూవీ అవుతుంది.