
గత కొన్నేళ్లుగా హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరి జంట వార్తల్లో నిలుస్తూ అభిమానులకు కనువిందు చేస్తూనే ఉంది. తాజాగా ఈ జంట షిర్డీతో పాటు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. దోష నివారణకు నయనతార ముందుగా ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 2022వ సంవత్సరం ప్రథమార్థంలో వీరి పెళ్లి జరగడం ఖాయం అంటున్నారు కొంత మంది సన్నిహితులు. నయనతార, విఘ్నేష్ శివన్‌కు ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది.
త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. పెళ్లికి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే వీరి పెళ్లికి ఇరువురికి చెందిన కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందినట్టు సమాచారం. గతంలో ఐశ్యర్య రాయ్ కూడా తన జాతక దోష నివారణకై ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే కోవలో ఇప్పుడు నయనతార కూడా ముందుగా ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment