
సోషల్ మీడియాలో నిత్యం బాలీవుడ్ కపుల్స్ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఐశ్వరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్యల హగ్ నెటిజన్ల మనసును దోచుకుంటోంది. మన సెలబ్రిటీలు ఏదో ఒక ఆట ఆడి వాటి వల్ల వచ్చిన డబ్బును చారిటీకి ఇస్తూ ఉంటారు. అలాగే బాలీవుడ్‌లో కూడా ఇలాంటి ఓ కార్యక్రమే ఇటీవల జరిగింది.
ఓ స్వచ్చంద సంస్థ కోసం బాలీవుడ్ తారల్లో కొందరు ఫుట్‌బాల్ ఆడారు. ఈ ఆటలో అభిషేక్ బచ్చన్, ఆదిత్య రాయ్ కపూర్, ఇషాన్ ఖట్టర్, రణ్‌బీర్ కపూర్ లాంటి హీరోలు పాల్గొన్నారు. ఫుట్‌బాల్ ఆడుతుండగా.. మధ్యలో ఆరాధ్య తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకోగా.. తనను పైకి ఎత్తుకునే సన్నివేశం.. ఆ వెనువెంటనే ఐశ్వరాయ్ కూడా రావడం ముగ్గురు కలిసి హగ్ చేసుకోవడం అందరి మనసుల్ని ఆకట్టుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.