
'హెల్లో' కవర్ పేజీపై నీలికళ్ళ సోయగం
మాజీ ప్రపంచసుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ 'హెల్లో' మాగజైన్ కవర్ పేజీపై అభిమానులకు కనువిందు చేయనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫోటో షూట్లో ఐష్ సందడి చేసింది. అద్భుతమైన అందంతో మెరుపులు మెరిపించింది. డిజైనర్లు రామి అల్ ఆలీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన దుస్తుల్లో దేవకన్యలా వెలిగిపోయింది ఈ స్టన్నింగ్ బ్యూటీ.
దాదాపు ఐదేళ్ల తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ నలభై ఏళ్ల నీలికళ్ల సోయగం, సరికొత్త అందంతో తళుకులీనింది.
తాను కేవలం ఒక రంగానికే పరిమితం కాలేదని, తన నైపుణ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లానని తెలిపింది. మోడల్గా మొదలైన తన కెరీర్లో ప్రపంచ సుందరి కిరీటం.. ఆ తర్వాత ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నానని పేర్కొంది. విభిన్న రంగాల్లో సాధించిన ప్రావీణ్యం వల్లే ప్రపంచ వేదికల్లో భారతదేశానికి ప్రతినిధిగా వ్యవహరించానని తెలిపింది.
కాగా బాలీవుడ్ హీరోన అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మినిచ్చిన ఐష్.. ఆ తర్వాత నాలుగన్నరేళ్లపాటు ఇంటికే పరిమితమైంది. ఈ జీన్స్ హీరోయిన్ ఇపుడు సంజయ్ గుప్తా దర్శకత్వంలో జజ్బా మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.