stuns
-
పాత ఇంగ్లీష్ సినిమాల్లోని హీరోయిన్లా సమంత (ఫోటోలు)
-
బ్యూటిఫుల్ ఔట్ఫిట్ : అమలాపాల్ రాయల్ లుక్ (ఫొటోలు)
-
అంబానీ పెళ్లికి రాశీ ఖన్నా ఇలా ముస్తాబైంది! (ఫోటోలు)
-
రూ.100 కోట్ల అపార్ట్మెంట్ డీల్: షాక్ అవుతున్న మార్కెట్ నిపుణులు
ఆర్థిక పరిస్థితులు ఎలా న్నప్పటికీ రానున్న పదేళ్లలో రియల్ ఎస్టేట్ రంగానికి ఢోకా లేదన్న నిపుణుల అంచనాల మధ్య ఢిల్లీలో 100కోట్ల రూపాయల తాజా అపార్ట్మెంట్ డీల్ మార్కెట్ వర్గాలను విస్మయ పరుస్తోంది. గుర్గావ్ , ఢిల్లీలోని సంపన్న ప్రాంతాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ ఖర్చులు గణనీయంగా పెరగడంతో అత్యాధునిక అపార్ట్మెంట్ల ధరలు ఒక రేంజ్లో పెరిగినట్టు తెలుస్తోంది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, రియల్ ఎస్టేట్ కమ్యూనిటీ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని DLF ద్వారా ది కామెలియాస్ వద్ద 10వేలచదరపు అడుగుల అపార్ట్మెంట్ ఏకంగా రూ.100 కోట్లకు అమ్ముడు బోయింది. దీనికి సంబంధించిన వార్తల ఇపుడు బిజినెస్ వర్గాల్లో సందడి చేస్తోంది. కొన్ని నెలల క్రితం, అదే స్థలంలో అదే పరిమాణంలో ఉన్న అపార్ట్మెంట్ రూ.60 కోట్లకు విక్రయించారు. గత నాలుగు నెలల్లో ఈ అడ్రస్‌కి చదరపు అడుగుకి ధరలు గణనీయంగా పెరగడమే ప్రాపర్టీ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. (కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక) "చాలా స్టార్టప్ వ్యవస్థాపకులు, ఎంఎన్సీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివాసముండటమే కారణమని ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియాల్టీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ అభిప్రాయం. ముఖ్యంగా స్టార్ క్లాస్ ఎమినిటీస్, పర్యావరణ వ్యవస్థ కారణంగా ఇక్కడ నివసించడానికి ఇష్టపడతారు అందుకే DLF గోల్ఫ్ లింక్స్‌లో అపార్ట్మెంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంకా పూర్తికాని 10వేల చదరపు అడుగుల యూనిట్ ధర రూ.85 కోట్లకు విక్రయిస్తుంది డీఎల్ఎఫ్. అయితే దీనికితోడు అత్యాధునిక డిజైన్లు, ఇంటీరియర్స్ కోసం తహ తహలాడుతున్న కొనుగోలుదారులు వీటిన్నంటికి కలిపి రూ.100 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని అత్యంత ఖరీదైన కండోమినియంలలో ఒకటి ఈ ప్రాంతాన్ని పేర్కొంటున్నారు. గుర్గావ్, ఢిల్లీలోని సంపన్న ప్రాంతాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో నైరుతి సబర్బ్‌లోని అత్యాధునిక అపార్ట్మెంట్లు , లుటియన్స్ జోన్‌లోని మాన్షన్ల ధరలు పెరిగాయి. ఫలితంగా ముంబైలోని పాపులర్ ఏరియాల్లో ధరలకు పోటీగా ఇక్కడ చదరపు అడుగు ధర రూ.1 లక్ష దాటిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. (Amazon Layoffs: అమెజాన్ మళ్లీ షాక్ ఇచ్చింది: ఈసారి ఎవరంటే..!) ఆగస్ట్ నాటి నైట్ ఫ్రాంక్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరేడెకో) సంయుక్త నివేదిక ప్రకారం, భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి 5.8 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా. ది ఇప్పటికే ఉన్న 7.3శాతం వాటా నుండి GDPకి 15.5శాతం దోహదం చేస్తుంది.‘ఇండియా రియల్ ఎస్టేట్: విజన్ 2047’ నివేదిక ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్‌కు అధిక వాటా ఉంటుంది. "2047 నాటికి,వందేళ్ల స్వతంత్ర్య భారతావని ఆర్థిక వ్యవస్థ పరిమాణం 33-40 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్టు వెల్లడించింది.. -
CSK వద్దనుకుంది GT కొనుక్కుంది 20 లక్షలు తీసుకుని చెన్నై పై రెచ్చి పోయడుగా ....
-
యూట్యూబ్ ను ఏలుతున్న 'ఎడ్వర్డా' బీట్స్...
లయబద్ధమైన బీట్.. ముఖంలో తొణకని విశ్వాసం.. ఆ చిన్నారి డ్రమ్స్ వాయించిందంటే సంగీత ప్రియులే కాదు...చూసినవారంతా అడుగులు కదపాల్సిదే... అప్పుడప్పుడే పాఠశాల మెట్లు ఎక్కాల్సిన ఐదేళ్ళ వయసులోనే ... ఆమె చేయి తిరిగిన ప్రజ్ఞను ప్రదర్శించింది. ఎటువంటి లోపాలు లేకుండా డ్రమ్స్ వాయిస్తూ, స్టేజ్ షోలు, టీవీ షోలతో దూసుకుపోతోంది. ఆణిముత్యంలా ఆకట్టుకుంటున్న ఆ బాల కళాకారిణి ఎడ్వర్డా హెన్ క్లెయిన్ బటెరిస్టా ప్లే చేసిన వీడియోలు... ఇప్పుడు యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. బ్రెజిల్.. జాయిన్విల్లే నగరంలో నివసించే ఆరేళ్ళ ఎడ్వర్డా తన బీట్స్ తో సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తోంది. ఇంతకు ముందే ఎన్నో లోకల్ టీవీ ప్రోగ్రామ్స్ లో ప్రతిభను చాటిన బాలిక.. తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఓ సంవత్సరం క్రితం ఐదేళ్ళ అతి చిన్న వయసులో వాయిద్యాన్నిమొదలుపెట్టిన చిన్నారి... చేయి తిరిగిన విద్వాంసురాలిలా డ్రమ్స్ వాయించడం చూపరులను విస్మయ పరుస్తోంది. అతి సుతారంగా కర్రలు తిప్పుతూ చాకచక్యంగా బీట్స్ వేసే ఆమె... వాద్య పరికరాల వెనుక నవ్వుతూ నిలబడినట్లే కనిపిస్తుంది. ట్రాక్ తో పాటు గొంతెత్తి పాడుతూ శక్తివంతంగా తన పరాక్రమాన్ని చాటుతోంది. ప్రదర్శన ముగించే మూడు నిమిషాలకు ముందు ఈలలు, చప్పట్లతో ఆమెకు వచ్చే రెస్సాన్స్ ఓ ప్రముఖ విద్యాంసుడికి కూడా రాదేమో అనిపిస్తుంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఆ బాల మేధావి వీడియోను ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పైగా చూడటమే కాదు, ఎందరో ఆమెను అభినందిస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. ''నిజానికి ఓ ఐదేళ్ళ చిన్నారి ఇంత అద్భుతంగా డ్రమ్స్ వాయించడం ఆశ్చర్యపరుస్తోంది.", "డ్రమ్స్ వాయిస్తూ పాటను కూడ పాటడం నిజంగా ఆశ్చర్యం" అంటూ వచ్చిన కామెంట్లు ఇప్పుడు ఆమె ప్రతిభకు పట్టం కడుతున్నాయి. -
'హెల్లో' కవర్ పేజీపై నీలికళ్ళ సోయగం
మాజీ ప్రపంచసుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ 'హెల్లో' మాగజైన్ కవర్ పేజీపై అభిమానులకు కనువిందు చేయనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫోటో షూట్లో ఐష్ సందడి చేసింది. అద్భుతమైన అందంతో మెరుపులు మెరిపించింది. డిజైనర్లు రామి అల్ ఆలీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన దుస్తుల్లో దేవకన్యలా వెలిగిపోయింది ఈ స్టన్నింగ్ బ్యూటీ. దాదాపు ఐదేళ్ల తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ నలభై ఏళ్ల నీలికళ్ల సోయగం, సరికొత్త అందంతో తళుకులీనింది. తాను కేవలం ఒక రంగానికే పరిమితం కాలేదని, తన నైపుణ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లానని తెలిపింది. మోడల్‌గా మొదలైన తన కెరీర్లో ప్రపంచ సుందరి కిరీటం.. ఆ తర్వాత ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నానని పేర్కొంది. విభిన్న రంగాల్లో సాధించిన ప్రావీణ్యం వల్లే ప్రపంచ వేదికల్లో భారతదేశానికి ప్రతినిధిగా వ్యవహరించానని తెలిపింది. కాగా బాలీవుడ్ హీరోన అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మినిచ్చిన ఐష్.. ఆ తర్వాత నాలుగన్నరేళ్లపాటు ఇంటికే పరిమితమైంది. ఈ జీన్స్ హీరోయిన్ ఇపుడు సంజయ్ గుప్తా దర్శకత్వంలో జజ్బా మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. -
ఐష్ కళ్లలో అందం తగ్గింది ?