![Real estate news rs100 Crore Gurgaon apartment sale stuns market check details - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/11/gurgram_100cr%20deal.jpg.webp?itok=rBjEYC5Y)
ఆర్థిక పరిస్థితులు ఎలా న్నప్పటికీ రానున్న పదేళ్లలో రియల్ ఎస్టేట్ రంగానికి ఢోకా లేదన్న నిపుణుల అంచనాల మధ్య ఢిల్లీలో 100కోట్ల రూపాయల తాజా అపార్ట్‌మెంట్ డీల్ మార్కెట్ వర్గాలను విస్మయ పరుస్తోంది. గుర్గావ్ , ఢిల్లీలోని సంపన్న ప్రాంతాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ ఖర్చులు గణనీయంగా పెరగడంతో అత్యాధునిక అపార్ట్‌మెంట్ల ధరలు ఒక రేంజ్‌లో పెరిగినట్టు తెలుస్తోంది.
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, రియల్ ఎస్టేట్ కమ్యూనిటీ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని DLF ద్వారా ది కామెలియాస్ వద్ద 10వేలచదరపు అడుగుల అపార్ట్‌మెంట్ ఏకంగా రూ.100 కోట్లకు అమ్ముడు బోయింది. దీనికి సంబంధించిన వార్తల ఇపుడు బిజినెస్ వర్గాల్లో సందడి చేస్తోంది. కొన్ని నెలల క్రితం, అదే స్థలంలో అదే పరిమాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ రూ.60 కోట్లకు విక్రయించారు. గత నాలుగు నెలల్లో ఈ అడ్రస్‌కి చదరపు అడుగుకి ధరలు గణనీయంగా పెరగడమే ప్రాపర్టీ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. (కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక)
"చాలా స్టార్టప్ వ్యవస్థాపకులు, ఎంఎన్‌సీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివాసముండటమే కారణమని ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియాల్టీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ అభిప్రాయం. ముఖ్యంగా స్టార్ క్లాస్ ఎమినిటీస్, పర్యావరణ వ్యవస్థ కారణంగా ఇక్కడ నివసించడానికి ఇష్టపడతారు అందుకే DLF గోల్ఫ్ లింక్స్‌లో అపార్ట్‌మెంట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది.
ఇంకా పూర్తికాని 10వేల చదరపు అడుగుల యూనిట్ ధర రూ.85 కోట్లకు విక్రయిస్తుంది డీఎల్‌ఎఫ్. అయితే దీనికితోడు అత్యాధునిక డిజైన్లు, ఇంటీరియర్స్ కోసం తహ తహలాడుతున్న కొనుగోలుదారులు వీటిన్నంటికి కలిపి రూ.100 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని అత్యంత ఖరీదైన కండోమినియంలలో ఒకటి ఈ ప్రాంతాన్ని పేర్కొంటున్నారు. గుర్గావ్, ఢిల్లీలోని సంపన్న ప్రాంతాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో నైరుతి సబర్బ్‌లోని అత్యాధునిక అపార్ట్‌మెంట్లు , లుటియన్స్ జోన్‌లోని మాన్షన్‌ల ధరలు పెరిగాయి. ఫలితంగా ముంబైలోని పాపులర్ ఏరియాల్లో ధరలకు పోటీగా ఇక్కడ చదరపు అడుగు ధర రూ.1 లక్ష దాటిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. (Amazon Layoffs: అమెజాన్ మళ్లీ షాక్ ఇచ్చింది: ఈసారి ఎవరంటే..!)
ఆగస్ట్ నాటి నైట్ ఫ్రాంక్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరేడెకో) సంయుక్త నివేదిక ప్రకారం, భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి 5.8 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా. ది ఇప్పటికే ఉన్న 7.3శాతం వాటా నుండి GDPకి 15.5శాతం దోహదం చేస్తుంది.‘ఇండియా రియల్ ఎస్టేట్: విజన్ 2047’ నివేదిక ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్‌కు అధిక వాటా ఉంటుంది. "2047 నాటికి,వందేళ్ల స్వతంత్ర్య భారతావని ఆర్థిక వ్యవస్థ పరిమాణం 33-40 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్టు వెల్లడించింది..
Comments
Please login to add a commentAdd a comment