ఐష్ వదులుకుంది.. రాణి అందుకుంది! | Aishwarya Rai Bachchan: Films she was offered | Sakshi
Sakshi News home page

ఐష్ వదులుకుంది.. రాణి అందుకుంది!

Published Sun, May 29 2016 11:17 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఐష్ వదులుకుంది.. రాణి అందుకుంది! - Sakshi

ఐష్ వదులుకుంది.. రాణి అందుకుంది!

ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుని బాలీవుడ్ లో అడుగుపెట్టి అగ్రతారగా ఎదిగింది ఐశ్వర్యరాయ్ బచ్చన్. హిందీలో టాప్ హీరోలు అందరి సరసన నటించింది. బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాల్లో చాలా చిత్రాలు ఘన విజయం సాధించాయి. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి బిజీ అయిపోయిన ఐష్ డైరీ ఖాళీలేక వదిలిలేసిన సినిమాలు కూడా సక్సెస్ కావడం విశేషం. కుచ్ కుచ్ హోతా(1998) సినిమాలో రాణిముఖర్జి పాత్రకు మొదట ఐష్ ను అడిగారు. అయితే డేట్స్ ఖాళీలేకపోవడంతో ఈ అవకాశం వదులుకుంది.

'దోస్తానా' సినిమాలో ప్రియాంక చోప్రా చేయాల్సి పాత్ర ముందుగా ఐశ్వర్యరాయ్ కే దక్కింది. బిజీగా ఉండడంతో ఈ అవకాశం కూడా ఐష్ వదులుకుంది. హీరోయిన్, భూల్ భులైయా, వీర్ జారా సినిమాల్లో కూడా ఆమె నటించాల్సినవే. 'చల్తే చల్తే' సినిమా షూటింగ్ లో షారూఖ్ ఖాన్ తో సల్మాన్ ఖాన్ గొడవ చేయడంతో ఐశ్వర్యరాయ్ స్థానంలో రాణిముఖర్జిని తీసుకున్నారు.

మిస్ ఇండియాగా ఎంపికైనప్పుడే బాలీవుడ్ లో తెరంగ్రేటం చేయడానికి రెడీ అయింది. 'రాజా హిందూస్తానీ'లో ఆమిర్ ఖాన్ సరసన నటించేందుకు ఓకే చెప్పింది. అయితే మిస్ వరల్డ్ పోటీలు ఉండడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. కాగా, ఐష్ వదిలేసిన సినిమాల్లో నటించిన రాణిముఖర్జి స్టార్ గా ఎదిగించింది. ఈ విషయంలో ఐష్ కు రాణి థ్యాంక్స్ చెప్పుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement