సాక్షి, హైదరాబాద్: అందం అంటే ఐశ్వర్యరాయ్. ఇన్ని పూల రెక్కలు. కొన్ని తేనె చుక్కలు రంగరించిన సొగసు ఐష్. అసలు ఐశ్వర్యరాయ్ లేకుండా బ్యూటీ అనే పదం చిన్నబోదూ. వయసు హాఫ్ సెంచరీకి దగ్గర పడుతున్నా ఆమింకా అందాల ఐశ్వర్యమే. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుని సంవత్సరాలు గడుస్తున్నా వన్నె చెదరని శిల్పం. అందం, అభినయం కలగలసిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌కి హ్యపీ బర్తడే అంటోంది. సాక్షి. కామ్.
చక్కటిరూపం, అభినయంతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపందించుకున్న అందమైన నటి ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యకంగా చెప్సాల్సిన అవసరం లేదు. తనదైన స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని, బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషా చిత్రల్లో కూడా వీరాభిమానులను సొంతం చేసుకుంది. 1973 నవంబర్ 1న, కృష్ణరాజ్ రాయ్ బృందారాయ్ దంపతులకు మంగళూరులో జన్మించిన ఐశ్వర్య రాయ్ 48వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది.
మరోవైపు తనకున్న ఒక చిలిపి సెంటిమెంట్‌ను గురించి గతంలో సరదాగా ప్రస్తావించింది ఐశ్వర్య. మిస్ ఇండియా పోటీలకెళ్లేటపుడు వర్షం పడిందట. అలాగే తన డ్రెస్ జిప్ ఫెయిల్ అయిందట. దీంతో ఆమె డిజైనర్ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. మిస్ వరల్డ్ పోటీలపుడు కూడా అచ్చం ఇలాగే జరిగిందంటూ గుర్తు చేసుకుంది. విమాన ప్రయాణంలో అనుకోకుండా తన ఫ్రాక్ జిప్ ఫెయిల్ అయిందనీ, వర్షం కూడా పడిందని చెప్పుకొచ్చింది. ఇది యాదృచ్ఛికం, బ్లైండ్ బిలీఫ్ అయినా ఈ విషయం గుర్తొస్తే.. ఇప్పటికీ నవ్వొస్తుంది అని ఐష్ తన పాతజ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment