నా జీవితానికి గొప్ప బహుమతి: ఐశ్వర్య
బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ శుక్రవారం 41 ఏట అడుగుపెట్టారు. దీపావళి పండగతోపాటు నా పుట్టిన రోజు కూడా రావడం చాలా సంతోషం కలిగిస్తోంది. ఈ జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడికి రుణపడి ఉంటాను, ఇంత గొప్ప జీవితాన్ని ప్రసాదించిన నా తల్లి తండ్రులకు కృతజ్ఞతలు అని అన్నారు.
ప్రస్తుతం తన కూతురే తనకు ప్రపంచం అని.. నా జీవితానికి ఆరాధ్య గొప్ప బహుమతి అని అన్నారు. తన కూతరు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఆర్ధరాత్రి బర్త్ డే పాటను పాడింది అని ఐశ్వర్య తెలిపింది.
తన పుట్టిన రోజున క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ధన సహాయం అందించారు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ బాధితులను ఆదుకుంటాను. ఈ సంవత్సరం కూడా కొంత ఆర్ధిక సహాయాన్ని అందించాను అని అన్నారు. బాలీవుడ్ లో అగ్రతారగా రాణిస్తున్న 2007లో అభిషేక్ బచ్చన్ పెళ్లాడిన సంగతి తెలిసిందే.