istambul
-
అదిరిందయ్యా.. ఇందూరు పంచ్
నిజామాబాద్ స్పోర్ట్స్ : బాక్సింగ్ ప్రపంచంలో ఇందూరు బిడ్డ నిఖత్ జరీన్ కీర్తి కిరీటంగా నిలిచింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో గురువారం జరిగిన సీనియర్ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ (52 కేజీల విభాగం)లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. నిఖత్ జరీన్ 3–2 తేడాతో థాయ్‌లాండ్ దేశానికి చెందిన జిట్‌పోంగ్ జుటామస్‌పై గెలిచి బంగారు పతకం సాధించింది. నిఖత్ విజయంతో జిల్లా లోని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ క్రీడాకారులు నిఖత్ తమకు స్ఫూర్తిగా నిలిచిందంటున్నారు. నిఖత్‌లో ఉన్న పట్టుదల, క్రమశిక్షణే ఆమెను ప్రపంచ చాంపియన్‌గా నిలిపిందని క్రీడా ప్రముఖులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌కు చెందిన నిఖత్ 1996 జూన్ 14న జన్మించింది. ఒకటో తరగతి నుంచి పది వరకు ఇక్కడే చదివిన నిఖత్ ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. ప్రస్తుతం ఎంబీఏ మొదటి సంవత్స రం చదువుతోంది. సాధించిన విజయాలు ఇలా.. 2011లో టర్కీలో జూనియర్ మహిళ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం 2012లో సెర్బియాలో బాక్సింగ్ టోర్నమెంట్లో రజిత పతకం 2013లో బల్గేరియాలో అండర్–19 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజితం 2014లో సెర్బియాలో 3వ నేషన్ కప్‌లో బంగారు పతకం 2014లో సెర్బియాలో అండర్–19 బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకం 2015లో పంజాబ్‌లోని జలంధర్‌లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్ షిప్లో బంగారుపతకం, బెస్ట్ బాక్సర్ అవార్డు 2015లో శ్రీలంకలో జరిగిన సీనియర్ నేషనల్ టోర్నమెంట్లో బంగారు పతకంతో పాటు బెస్ట్ బాక్సర్ అవార్డు 2015లో అస్సాంలో జరిగిన జాతీయ సీనియర్ టోర్నమెంట్లో బంగారు పతకం 2016లో అస్సాంలో జరిగిన సౌత్ ఏషియన్ ఫెడరేషన్ టోర్నమెంట్లో క్యాంసం 2016లో కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. 2016లో ఉత్తరఖండ్ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి సీనియర్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో క్యాంసం 2018లో హరియానాలో సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో క్యాంసం. 2018లో సెర్బియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకం 2019లో బెల్లారిలో జరిగిన జాతీయ బాక్సింగ్ టోర్నిలో రజితం 2019 ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు బల్గేరియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకం 2019లో బ్యాంకాక్‌లో అసియా బాక్సింగ్ చాంపియన్ షిప్లో క్యాంసం 2019లో గౌహతిలో జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నిలో క్యాంసం 2019లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్‌లో రజితం 2019లో ఇటలీలో జరిగిన బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం 2019లో టోక్యోలో జరిగిన టోర్నమెంట్లో క్యాంసం 2021లో టర్కీలోని ఇస్తాంబుల్‌లో బాక్సింగ్ చాంపియన్ షిప్లో క్యాంసం 2021లో హరియానాలో జరిగిన జాతీయ బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకంతో పాటు బెస్ట్బాక్సర్ అవార్డును అందుకుంది. తండ్రితో వాకింగ్ చేస్తూ.. నిఖత్ జరీన్ తన తండ్రి జ మీల్ హైమాద్తో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మై దానంలోకి సరదగా ఆడుకోవడానికి 13 ఏళ్ల వయస్సులో వచ్చేది. మైదానంలో స్టేజిపై బాక్సింగ్ కోచ్ షంసమోద్దీన్ బాక్సింగ్‌లో శిక్షణ ఇవ్వడాన్ని నిఖత్ గమనించింది. బాక్సింగ్ శిక్షణ ఇస్తున్న తీరు, ప్రాక్టీ సు చేస్తున్న క్రీడాకారులను చూసి తను కూడా బా క్సింగ్ నేర్చుకుంటానని తండ్రికి చెప్పింది. తండ్రి దెబ్బలు తగులుతాయని సర్దిచెప్పాడు. అయినా పట్టుబట్టడంతో కోచ్ షంసమోద్దీన్కు తన కూతు రును పరిచయం చేసి బాక్సింగ్‌లో శిక్షణ ఇవ్వాలని కోరాడు. శిక్షణ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ని ఖత్ పవర్ పంచ్‌లను విసరడం నేర్చుకుంది. రన్నింగ్‌లో రాణించాలని మొదట్లో అనుకున్న నిఖత్ బా క్సింగ్పై ఏర్పడిన మక్కువతోనే ఈ రోజు ప్రపంచ స్థాయిలో నిలిచి బంగారు పతకం సాధించింది. రాష్ట్రానికే గర్వకారణం ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో ఇందూరు ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణం. ఆమె ఘన విజయంతో తెలంగాణ, జిల్లా కీర్తి ప్రతిష్టలు మరోసారి ప్రపంచం నలుదిశలా వ్యాపించాయి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులను అన్నివిధాలా ఆదుకుంటుంది, ప్రోత్సహిస్తోందని చెప్పడానికి జరీన్ విజయమే నిదర్శనం. ఆమెకు రూ. లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తా. – వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి మాలాంటి క్రీడాకారులకు ఆదర్శం బాక్సింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. నిఖత్ బాక్సింగ్ ఆడుతుంటే చూసి తనలాగా పంచ్ విసరాలని శిక్షణ తీసుకున్నాను. నిఖత్ మాలాంటి క్రీడాకారులందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె సాధించిన విజయం మరిచిపోలేనిది. ఈ విజయం మాకు పండుగలా మారింది. – గీర్వాని శివసాయి, జాతీయ స్థాయి బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్‌కు అభినందనలు.. నిఖత్‌కు బాక్సింగ్‌లో మొట్టమొదటిసారిగా శిక్షణ ఇచ్చింది నేనే అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తనలో పట్టుదల, కృషి, తపన, సాధించాలన్న కసి ఉండడం వల్లే ఉన్నత శిఖరాలకు ఎదిగింది. నా శిక్షణలో నా కొడుకులతో పాటు నిఖత్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఒక కోచ్‌గా ఇది నాకు చాలా గర్వకారణం. – షంసమోద్దీన్, బాక్సింగ్ కోచ్ -
Anand Mahindra: నితిన్ గడ్కారీజీ మనమూ ఇలా చేద్దామా?
కేంద్ర రవాణా, ఉపరితల శాఖ మంత్రిగా నితిన్ గడ్కారీ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఓవైపు ఈవీ వెహికల్స్‌ని ప్రోత్సహిస్తూనే మరోవైపు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో స్వయంగా హైడ్రోజన్ సెల్ కారులో ప్రయాణం చేస్తున్నారు. ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్సీ ఇంజన్ల తయారీపై మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు సూచనలు చేస్తున్నారు. కాలుష్య రహిత ఇంధనం కోసం ఇంతలా పరితపిస్తున్న మంత్రి నితిన్ గడ్కారీకి ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా ఓ సూచన చేశారు. టర్కీకి చెందిన ఇస్తాంబుల్ యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. రోడ్లపై వాహనాలు వేగంగా ప్రయాణించినప్పుడు గాలిని చీల్చుకుంటూ వెళ్తాయి. ఈ క్రమంలో గాలులు బలంగా వీస్తాయి. ఈ విండ్ ఫోర్స్‌ని ఉపయోగించుకుని కరెంటు ఉత్పత్తి చేసే టర్బైన్లని డెవలప్ చేశారు. ఈ టర్బైన్లు గంటకి 1 కిలోవాట్ పవర్‌ను జనరేట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టను టర్కీలోని ఇస్తాంబుల్ రోడ్లపై చేపట్టారు. ఇస్తాంబుల్‌లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు వీడియోను ఉద్దేశిస్తూ .. ఇండియాలో ఉన్న ట్రాఫిక్‌కి ఈ తరహా ప్రాజెక్టును కనుక చేపడితే ప్రపంచంలోనే విండ్ పవర్లో ఇండియా గ్లోబల్ ఫోర్స్‌గా నిలుస్తుంది. మనదేశంలోని హైవేల వెంట ఇలాంటి టర్బైన్లు ఏర్పాటు చేద్దామా అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని అడిగారు ఆనంద్ మహీంద్రా. Developed by Istanbul Technical University. Ingenious. Uses the wind generated by passing traffic. Given India’s traffic, we could become a global force in wind energy! 😊 Can we explore using them on our highways @nitin_gadkari ji? https://t.co/eEKOhvRpDo — anand mahindra (@anandmahindra) April 6, 2022 -
Viral Video: శునకం చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా
అంకారా: శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతుంటారేమో.. కానీ కుక్కలు మాత్రం అలాకాదు! అందుకే చాలా మంది శునకాలను తమ కుటుంబంలో ఒక సభ్యునిగా, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. వాటికి స్నానం చేయించటం దగ్గర నుంచి మంచి ఆహారం పెట్టడం, వాకింగ్‌కు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. కుక్కలు కూడా తమ యజమానుల పట్ల ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తూ వారితో ప్రేమగా ఆడుకుంటాయి. ఒక్కోసారి తమ యజమాని కనిపించకపోతే తల్లడిల్లిపోతాయి. ఆహారం కూడా తినకుండా ఎదురుచూస్తాయి. ఇక యజమాని రాగానే, వారి చుట్టూ తిరుగుతూ.. తోక ఆడిస్తూ.. నాకుతూ.. తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటాయి. ఎవరైనా యజమానితో దురుసుగా మాట్లాడినా, కొట్టడానికి వెళ్లినా వారిపై దూకి దాడి చేస్తాయి. కాగా, ఇప్పటికే శునకాలు, తమ యజమానుల పట్ల ప్రదర్శించే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా టర్కీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. వివరాలు.. ఇస్తాంబుల్‌లోని బుయుకడా ఐలాండ్‌లోని ఒక మహిళ అనారోగ్యానికి గురై, కొన్ని రోజుల పాటు మంచానికే పరిమితమయ్యింది. ఆ మహిళ ఒక శునకాన్ని పెంచుకునేది. అయితే, ప్రతిరోజు తనతో ఆడుకునే యజమాని లేవకుండా ఒకే దగ్గర ఉండటాన్ని చూసి కుక్క తల్లడిల్లిపోయింది. ప్రతిరోజు తన యజమాని దగ్గరకు వెళ్లడం నోటితో నాకుతూ.. కదిలించటానికి ప్రయత్నించేది. కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో బంధువులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ కుక్క కూడా అంబులెన్సు వెనుక పరిగెడుతూ ఆసుపత్రికి చేరుకుంది. ఆ తర్వాత, యజమానిని ఆసుపత్రి గదిలోకి తరలించారు. అయితే, శునకం మాత్రం.. తన యజమాని కోసం ఆసుపత్రి బయట కూర్చుని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ మనుషుల కంటే శునకాలే నయం’, ‘ఆ మహిళ నిజంగా అదృష్టవంతురాలు’, ‘ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి..’, ‘ఆ మహిళ తొందరగా కొలుకోవాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు! వైరల్ వీడియో -
టర్కీలో కరువు తాండవం.. 45 రోజుల్లో..
అంకారా: టూరిజానికి ప్రసిద్ది చేందిన టర్కీ దేశంలో త్వరలోనే తీవ్ర కరువు తాండవించబోతుందని ఆదేశ నిపుణులు పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో టర్కీ ఎడారిగా మారబోతోందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ నీటితో కళకళలాడే ఇస్తాంబుల్ ఏడారిలా మారబోతుందని హెచ్చరిస్తున్నారు. రాబోయే 45 రోజుల్లో టర్కీ దేశంలోని నదులు, జలాశయాలతో పాటు డ్యామ్‌లు సైతం ఎండిపోయి తీవ్ర కరువు సంభవించనుందట. టర్కీలోని ప్రధానం నగరాల్లో వచ్చే కొన్ని నెలల్లో నీళ్లు ఎండిపోయి ఎడారిని తలపించనున్నాయంట. అయితే దీనికి ప్రధాన కారణం దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదు చేసుకోవడంతో దశాబ్ద కాలానికి కరువుకు దారితీసింది. దీనివల్ల దాదాపు 17 మిలియన్ల టర్కీ ప్రజలు నీటి కొరతను ఎదుర్కోనున్నారు. జనవరి నెల నుంచి మరో 110 రోజుల్లో అక్కడి డ్యాములు, రిజర్వాయర్లలోని నీరు కూడా ఎండిపోయే పరిస్థితి రానుంది. ఇక టర్కీలోని అతిపెద్ద నగరాలైన ఇజ్మిర్, బ్యూర్సాలోని డ్యామ్‌లు ఇప్పటికే 36శాతం, 24శాతం మేర నీళ్లు ఎండిపోయాయి. ఇక గోధుమను ఉత్పత్తి చేసే ప్రాంతాలైన కోన్యా ప్లేన్, ఎడ్రైన్ ప్రావిన్స్‌లలో కూడా సాగుకు నీరు లేక రైతులు విలవిల్లాడుతున్నారు. గ్రీస్, బుల్గారియా సరిహద్దుల్లోని ఈ ప్రాంతాలకు సాగుబడికి చేయడమే కష్టంగా మారింది. 2020లో అక్కడ నవంబర వరకు కనీసం 50 శాతం కూడా వర్షపాతం నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో గత నెలలో వర్షం కోసం వరుణుడిని ప్రార్థించాలంటూ మత వ్యవహారాల డైరెక్టరేట్ సూచించింది. నీటి డిమాండ్‌ను అదుపులో ఉంచే చర్యలకు బదులుగా మరిన్ని ఆనకట్టలను నిర్మించడం ద్వారా టర్కీ నీటి సరఫరాను విస్తరించాలని నిర్ణయించింది. -
వేళ్లు నరికి.. బాడీని ముక్కలు చేసి..
అంకారా: ప్రముఖ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి(59) హత్యకేసులో సౌదీ అరేబియా ప్రమేయానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సౌదీకి కాబోయే రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు ఖషోగి హత్యతో సంబంధం ఉందని టర్కీకి చెందిన ప్రముఖ దినపత్రిక ‘యెని సఫాక్’ వెల్లడించింది. ఖషోగి హత్య జరిగిన రోజు ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ నుంచి సల్మాన్ అనుచరుడొకరు రాజు కార్యాలయానికి నాలుగుసార్లు ఫోన్ చేసినట్టు సదరు పత్రిక తెలిపింది. రియాద్‌లో ఉన్నతస్థాయి పెట్టుబడుల శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ఈ విషయం వెలుగు రావడం గమనార్హం. మరోవైపు ఖషోగి హత్య కేసులో వాస్తవాలను వెలికి తీస్తామని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ హామీయిచ్చారు. ‘యెని సఫాక్’ వివరాల ప్రకారం... ఖషోగి తన పెళ్లికి అవసరమైన డాక్యుమెంట్ కోసం కాన్సులేట్‌కు వస్తున్నారని తెలుసుకుని 15 మంది సభ్యుల బృందం అక్టోబర్ 2న సౌదీ నుంచి ఇస్తాంబుల్‌కు వచ్చింది. ఖషోగి కాన్సులేట్‌లోకి ప్రవేశించగానే ఈ బృందం ఆయనను చుట్టుముట్టింది. ఆయన వేళ్లను నరికేసి, కిరాతకంగా హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని ముక్కులు చేశారు. సల్మాన్ అనుచరుడైన మహెర్ ముత్రెబ్ కాన్సులేట్ నుంచి సౌదీ నిఘావర్గాల ఉపాధ్యక్షుడు అహ్మద్ అల్ అసిరికి నాలుగుసార్లు ఫోన్ చేశాడు. మరొక ఫోన్ కాల్ అమెరికాకు చేశాడు. ఎంత వరకు నమ్మొచ్చు! ‘యెని సఫాక్’ వెల్లడించిన విషయాలను ఎంత వరకు నమ్మొచ్చు అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే టర్కీ సెక్యురిటీ వర్గాల సహాయంలో ఖషోగి హత్యకు సంబంధించిన విషయాలను ప్రభుత్వ అనుకూల దినపత్రికలు లీక్ చేస్తూ వచ్చాయి. కాన్సులేట్ బయట వేచివున్న ఖషోగి ప్రియురాలికి ఆనవాలు తెలియకుండా ఉండేందుకే ఆయన మృతదేహాన్ని ముక్కలు చేశారని గత వారమే ‘యెని సఫాక్’ వెల్లడించింది. అయితే ఈ విషయంపై అసోసియేటెడ్ ప్రెస్ ఎన్నిసార్లు ప్రశ్నించినా సౌదీ అరేబియా అధికారుల నుంచి సమాధానం రాలేదు. మహెర్ ముత్రెబ్.. ఇస్తాంబుల్‌లో ఉన్నారన్న విషయాన్ని కూడా సౌదీ అంగీకరించలేదు. ఖషోగి వచ్చిన సమయంలో ముత్రెబ్ కాన్సులేట్‌కు వచ్చిన ఫొటో బయటకు రావడంతో ఆయన అక్కడున్నట్టు తేలింది. సౌదీ రాజు సంతాపం మరోవైపు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్సౌద్, కాబోయే రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ సోమవారం ఉదయం ఖషోగి కుమారుడి సలా ఖషోగికి ఫోన్ చేసినట్టు సౌదీ మీడియా వెల్లడించింది. ఖషోగి మృతి పట్ల వారు సంతాపం ప్రకటించారని తెలిపింది. ఖషోగి మృతదేహం ఎక్కడుందో తమకు తెలియదని సౌదీ విదేశాంగ మంత్రి అదెల్ ఆల్-జుబెయిర్ చెప్పారు. ఖషోగి హత్య ‘మూర్కపు చర్య’గా ఆయన వర్ణించారు. దీన్ని ఎంతమాత్రమూ సమర్థించబోమని స్పష్టం చేశారు. ఖండించిన ఐరోపా దేశాలు ఖషోగి హత్యను జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఖండించాయి. ఈ హత్యోదంతంపై తక్షణమే వివరణ ఇవ్వాలని సౌదీ అరేబియాను డిమాండ్ చేశాయి. జర్నలిస్టులపై దాడులను సహించబోమని స్పష్టం చేశాయి. సౌదీ ప్రత్యేక దర్యాప్తు బృందం వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరముందన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆచితూచి స్పందించారు. సౌదీతో ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్న ప్రతిపాదనకు ఆయన అంగీకరించలేదు. -
కారుబాంబు దాడిలో 11 మంది మృతి
ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో మంగళవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని కారుబాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు అధికారులతో పాటు, నలుగురు పౌరులు మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. ఆందోళన కారులను అదుపుచేసే రయట్ కంట్రోల్ పోలీసు బృందం బస్సులో వెళ్తుండగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. పట్టణంలో పర్యటకులతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో రోడ్డు పక్కన గల భవంతులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సహిన్ తెలిపారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ వివరాలు తెలియలేదు. -
'గే' ర్యాలీపై పోలీసుల కాల్పులు
-
'గే' ర్యాలీపై పోలీసుల కాల్పులు
ఇస్తాంబుల్: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తూ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగరంలో ఎల్జీబీటీ (లెస్బియాన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రఖ్యాత తాక్సిమ్ స్క్వేర్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్సించిన వంలాది ఎల్జీబీటీ కార్యకర్తను అడ్డుకున్న పోలీసులు ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. వాటర్ క్యానన్లతో చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిలో విదేశీ టూరిస్టులు కూడా ఉన్నారు. ఎల్జీబీటీల ర్యాలీకి మద్దతు ప్రకటించిన విపక్షాలు.. ర్యాలీని అడ్డుకోవద్దంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అధికారికంగా ఇస్లామిక్ దేశమైనప్పటికీ టర్కీలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరు. అమెరికాలోని అన్నిరాష్ట్రాల్లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో టర్కీలోనూ అలాంటి చట్టాలు రూపొందించాలని ఎల్జీబీటీలు డిమాండ్ చేస్తున్నారు.