'గే' ర్యాలీపై పోలీసుల కాల్పులు | Police fire tear gas to break gay pride parade in Turkey | Sakshi
Sakshi News home page

'గే' ర్యాలీపై పోలీసుల కాల్పులు

Published Mon, Jun 29 2015 8:32 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

ప్రఖ్యాత తాక్సిమ్ స్క్వేర్ వద్ద ఎల్జీబీటీ కార్యకర్తలను వాటర్ క్యానన్లతో చెదరగొడుతున్న పోలీసులు - Sakshi

ప్రఖ్యాత తాక్సిమ్ స్క్వేర్ వద్ద ఎల్జీబీటీ కార్యకర్తలను వాటర్ క్యానన్లతో చెదరగొడుతున్న పోలీసులు

ఇస్తాంబుల్: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తూ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగరంలో ఎల్జీబీటీ (లెస్బియాన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్) కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రఖ్యాత తాక్సిమ్ స్క్వేర్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్సించిన వంలాది ఎల్జీబీటీ కార్యకర్తను అడ్డుకున్న పోలీసులు ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. వాటర్ క్యానన్లతో చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిలో విదేశీ టూరిస్టులు కూడా ఉన్నారు. ఎల్జీబీటీల ర్యాలీకి మద్దతు ప్రకటించిన విపక్షాలు.. ర్యాలీని అడ్డుకోవద్దంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అధికారికంగా ఇస్లామిక్ దేశమైనప్పటికీ టర్కీలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరు. అమెరికాలోని అన్నిరాష్ట్రాల్లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో టర్కీలోనూ అలాంటి చట్టాలు రూపొందించాలని ఎల్జీబీటీలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement