అంకారా: టూరిజానికి ప్రసిద్ది చేందిన టర్కీ దేశంలో త్వరలోనే తీవ్ర కరువు తాండవించబోతుందని ఆదేశ నిపుణులు పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో టర్కీ ఎడారిగా మారబోతోందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ నీటితో కళకళలాడే ఇస్తాంబుల్ ఏడారిలా మారబోతుందని హెచ్చరిస్తున్నారు. రాబోయే 45 రోజుల్లో టర్కీ దేశంలోని నదులు, జలాశయాలతో పాటు డ్యామ్‌లు సైతం ఎండిపోయి తీవ్ర కరువు సంభవించనుందట. టర్కీలోని ప్రధానం నగరాల్లో వచ్చే కొన్ని నెలల్లో నీళ్లు ఎండిపోయి ఎడారిని తలపించనున్నాయంట. అయితే దీనికి ప్రధాన కారణం దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదు చేసుకోవడంతో దశాబ్ద కాలానికి కరువుకు దారితీసింది. దీనివల్ల దాదాపు 17 మిలియన్ల టర్కీ ప్రజలు నీటి కొరతను ఎదుర్కోనున్నారు. జనవరి నెల నుంచి మరో 110 రోజుల్లో అక్కడి డ్యాములు, రిజర్వాయర్లలోని నీరు కూడా ఎండిపోయే పరిస్థితి రానుంది.
ఇక టర్కీలోని అతిపెద్ద నగరాలైన ఇజ్మిర్, బ్యూర్సాలోని డ్యామ్‌లు ఇప్పటికే 36శాతం, 24శాతం మేర నీళ్లు ఎండిపోయాయి. ఇక గోధుమను ఉత్పత్తి చేసే ప్రాంతాలైన కోన్యా ప్లేన్, ఎడ్రైన్ ప్రావిన్స్‌లలో కూడా సాగుకు నీరు లేక రైతులు విలవిల్లాడుతున్నారు. గ్రీస్, బుల్గారియా సరిహద్దుల్లోని ఈ ప్రాంతాలకు సాగుబడికి చేయడమే కష్టంగా మారింది. 2020లో అక్కడ నవంబర వరకు కనీసం 50 శాతం కూడా వర్షపాతం నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో గత నెలలో వర్షం కోసం వరుణుడిని ప్రార్థించాలంటూ మత వ్యవహారాల డైరెక్టరేట్ సూచించింది. నీటి డిమాండ్‌ను అదుపులో ఉంచే చర్యలకు బదులుగా మరిన్ని ఆనకట్టలను నిర్మించడం ద్వారా టర్కీ నీటి సరఫరాను విస్తరించాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment