ప్రేమకు పెద్దల అడ్డు.. పార్కుకు వచ్చి ఆత్మహత్య | Young Lovers Lost Life After Parents Not Agreed Their Love Chennai | Sakshi
Sakshi News home page

ప్రేమకు పెద్దల అడ్డు.. పార్కుకు వచ్చి ఆత్మహత్య

Published Sun, Jul 18 2021 7:42 AM | Last Updated on Sun, Jul 18 2021 7:59 AM

Young Lovers Lost Life After Parents Not Agreed Their Love Chennai - Sakshi

తిరువొత్తియూరు: ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువణ్ణామలై జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వందవాసి కొత్త బస్టాండ్‌ వద్దనున్న పార్కులో వాకింగ్‌ వెళ్లిన కొందరు యువతీ యువకుడి మృతదేహాలను గుర్తించారు.  పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. సమీపంలో విషం బాటిల్‌ ఉండడంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావించారు. యువకుడి సెల్‌ఫోన్‌ నుంచి చివరిగా వెళ్లిన నంబర్‌కు కాల్‌ చేసి మాట్లాడారు. అతనిచ్చిన సమాచారం మేరకు చెంగల్పట్టు జిల్లా మధురాంతకం తాలూకా కాట్టు కూడలూరు గ్రామానికి చెందిన శంకర్‌ కుమారుడు భరత్‌.. రామాపురం గ్రామానికి చెందిన షణ్ముగం కుమార్తె అక్షయ (19)ని గుర్తించారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో పార్కుకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement