
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మాజీ పోలీసు కానిస్టేబుల్‌ను కిరాయి గూండాలతో హత్య చేయించిన అతని భార్య (ఎస్‌ఐ) చిత్ర, కిరాయి రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి జిల్లా ఊత్తంకరై జిల్లా కల్లాలికి చెందిన సెంథిల్ కుమారు (48) పోలీస్ కానిస్టేబుల్. ఇతని భార్య చిత్ర (44) సింగారపేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.
ఈ ఏడాది సెపె్టంబర్ 16వ తేదీ సెంథిల్ కుమార్ అదృష్టమయ్యాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా సెంథిల్ కుమార్‌ను వివాహత సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అతని భార్య చిత్రా కిరాయి ముఠాతో హత్య చేయించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మహిళా ఎస్‌ఐ చిత్ర, ఆమెకు సహరించిన మహిళా మంత్రగత్తే సరోజ (32), రౌడీలు విజయ్ కుమార్ (21), రాజ పాండ్యన్ (21)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చదవండి: (Anusha: ఇప్పటికే మూడు సర్జరీలు.. బాధను తట్టుకోలేక..)
Comments
Please login to add a commentAdd a comment