
ప్రతీకాత్మకచిత్రం
చెన్నై: వివాహేతర ప్రియురాలి బిడ్డలకు ఇద్దరికి విషం ఇచ్చి హత్య చేసి అనంతరం ప్రియుడు కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. చెన్నై కొరుక్కుపేట భారతీ నగర్ స్లమ్ క్లియరెన్స్ కాలనీకి చెందిన కవిత భర్త రాహుల్. వీరికి స్టీఫన్ (9), ఆల్‌బర్ట్ (7) ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ప్రవర్తనపై సందేహం రావడంతో రాహుల్ భార్యను విడిచి దూరంగా వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో కవితకు రెడ్‌హిల్స్‌కు చెందిన రాజేష్ (31)తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో రాజేష్ కవిత ఇంటికి వచ్చి వెళుతున్నట్లు తెలిసింది. ఇటీవల కొంత కాలంగా రాజేష్‌తో కవిత మాట్లాడడం మానేసింది. దీంతో ఆగ్రహించిన రాజేష్ బుధవారం రాత్రి కవిత ఇంటికి వచ్చి విషం కలిపిన కూల్‌డ్రింక్స్‌ను కవిత ఇద్దరు కుమారులకు ఇచ్చాడు. తరువాత రాజేష్ కూడా అదే కూల్‌డ్రింక్‌ను తాగాడు. దీంతో ముగ్గురు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
చదవండి: (న్యాయస్థానంపై తీవ్రవ్యాఖ్యలు.. యూట్యూబర్ శంకర్‌కు 6 నెలల జైలు)
Comments
Please login to add a commentAdd a comment