![Case registered against young man who is filming obscene videos - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/4/hyd_0.jpg.webp?itok=wat__DmO)
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న యువతిని వెంటిలేటర్‌లో నుంచి ఓ యువకుడు సెల్ ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా గుర్తించిన ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడకు చెందిన యువతి(30) గత నెల 31న ఉదయం తన ఇంట్లో స్నానం చేస్తుండగా అదే ఇంటి పై అంతస్తులో ఉండే అఖిల్ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. దీనిని గుర్తించి ఆమె బయటికి వచ్చేలోగా అతను అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment