
సాక్షి, హైదారాబాద్ : తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అశ్లీల వీడియోలు పంపుతున్నారని వేధిస్తున్నారంటూ సినీ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. గుర్తుతెలియన వ్యక్తులు కొద్ది రోజులుగా ఈ పనులు చేస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయాన్నే లేచి ఫోన్ చూడాలంటేనే భయమేస్తుందని ఆమె పోలీసులతో తన బాధను చెప్పుకున్నారు.
కొన్ని నంబర్లు బ్లాక్ చేసినా.. వేరే నంబర్‌ల నుంచి అశ్లీల వీడియోలు పంపుతూ, తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. కల్యాణి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment