
ప్రతీకాత్మకచిత్రం
బెంగళూరు: భార్య నగ్న వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని ఓ భర్త బెదిరిస్తున్నాడు. లక్కసంద్రకు చెందిన 25 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బసవనగుడి మహిళా పోలీసులు హనుమంతనగర నివాసి ప్రగత్ పురుషోత్తమ్ పై కేసు నమోదు చేశారు. ఏడేళ్ల క్రితం పెళ్లి సమయంలో అర్ధ కేజీ బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి సామగ్రి, ఇంకా విలువైన వస్తువులను కట్నం కింద అందజేశారు.
కొత్తలో వైవాహిక జీవితం సజావుగా నడిచింది. తరువాత మరింత కట్నం తీసుకురావాలని వేధింపులకు దిగాడు. దీంతో అత్తమామలు రూ.40 లక్షలు నగదు అందించారు. తరచూ మద్యం తాగి భార్యను వేధించేవాడు. సగం ఆస్తిని తన పేరుతో రాయాలని, లేదంటే నీ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని భర్త బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.
చదవండి: (పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోమి..)
Comments
Please login to add a commentAdd a comment