Bengaluru Man Arrested For Sharing Wife Naked Videos - Sakshi
Sakshi News home page

సామాజిక మాధ్యమాల్లో భార్య నగ్న దృశ్యాలు.. కస్టమర్లు ఒప్పుకుంటే..

Published Sat, Feb 5 2022 4:05 PM | Last Updated on Sat, Feb 5 2022 5:33 PM

Man Arrested For Sharing Wifes Naked Videos at Bengaluru - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

బెంగళూరు: విటులకు ఆహ్వానం పలుకుతూ తన భార్య నగ్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచిన భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మండ్యకు చెందిన వ్యక్తి, మాగడి ప్రాంతానికి చెందిన యువతి ఎలక్ట్రానిక్‌ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసేవారు. వీరిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడాదిన్నర కుమార్తె ఉంది. పరప్పన అగ్రహార వద్ద ఉన్న సింగసంద్రలో నివాసం ఉంటున్నారు. 

నగ్న వీడియోలు చూసేందుకు అలవాటు పడ్డ ఈ వ్యక్తి భార్య సమ్మతితో ఆమె ముఖం కనిపించకుండా నగ్న దృశ్యాలు రికార్డు చేశాడు. స్నేహితుడి సూచనమేరకు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. గమనించిన ఓ వ్యక్తి సంప్రదించగా ఇంటికి పిలిపించి భార్యతో లైంగిక చర్యకు అనుమతించాడు. కస్టమర్లు ఒప్పుకుంటే సెల్‌ఫోన్‌లో వీడియో తీసేవాడు. డబ్బు కోసం డిమాండ్‌ చేయకుండా కస్టమర్లు ఇచ్చినంత తీసుకునేవాడని పోలీస్‌వర్గాలు తెలిపాయి. 

చదవండి: (మేనకోడలితో వివాహేతర సంబంధం.. సినీఫక్కీలో భార్యను..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement