బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టులో బుధవారం(మే29) ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ప్రజ్వల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
గురువారమే బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాల్సిందిగా ప్రజ్వల్ తరపు న్యాయవాది కోరగా కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ సమయం కోరింది. దీంతో జడ్జి సంతోష్ గజానన్ విచారణను మే 31కి వాయిదా వేశారు. లైంగిక దౌర్జన్యం వీడియోలు వెలుగు చూసిన తర్వాత ఏప్రిల్‌లో ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు.
ప్రస్తుతం జర్మనీలో ఉన్న ప్రజ్వల్ మే31న భారత్ వస్తానని ఇప్పటికే ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తాజాగా కోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను 31కే వాయిదా వేయడంతో ఆయన ఆరోజు వస్తారా మళ్లీ ఏదైనా తేదీ ప్రకటిస్తారా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.
ప్రజ్వల్ ఎన్డీఏ కూటమి తరపున జేడీఎస్ పార్టీ నుంచి హసన్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న కర్ణాటకలో పోలింగ్ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment