సాక్షుల్ని మళ్లీ విచారించండి | Uber cab rape case: Accused seeks to recall all witnesses | Sakshi
Sakshi News home page

సాక్షుల్ని మళ్లీ విచారించండి

Published Mon, Feb 16 2015 10:47 PM | Last Updated on Thu, Aug 30 2018 9:11 PM

Uber cab rape case: Accused seeks to recall all witnesses

న్యూఢిల్లీ:  ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులను మరోసారి విచారించాలని కోరుతూ ఉబర్ క్యాబ్‌లో అత్యాచార కేసు నిందితుడు శివ్‌కుమార్ యాదవ్ స్థానిక న్యాయస్థానాన్ని కోరారు. సోమవారం ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనతో పనిచేస్తున్న న్యాయవాదికి వాదనను బలంగా వినిపించే శక్తి లేదని యాదవ్ తర ఫు న్యాయవాది ధర్మేంద్ర మిశ్రా ఈ సందర్భంగా అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాకు తెలియజేశారు. ప్రాసిక్యూషన్ తరఫు సాక్షుల వద్ద మరికొన్ని వివరణలను తీసుకోవాల్సి ఉందని, అందువల్ల మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉందని విన్నవించారు. అయితే ఈ వాదనను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు. విచారణను జాప్యం చేసేందుకు జరుగుతున్న యత్నమని ఆరోపించారు. కాగా ఈ పిటిషన్‌పై ఈ నెల 18వ తేదీన కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement