Shiv Kumar Yadav
-
దోషిగా తేలిన శివకుమార్
-
దోషిగా తేలిన శివకుమార్
న్యూఢిల్లీ: మహిళా ఎగ్జిక్యూటివ్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో 'ఉబర్' క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఈనెల 23న అతడికి శిక్ష ఖరారు చేయనుంది. అతడిపై మోపిన అన్ని అభియోగాలు కోర్టులో నిరూపితం అయ్యాయని అతడి తరపు న్యాయవాది ధర్మేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు. గతేడాది డిసెంబర్ 5వ తేదీన రాత్రి బాధితురాలు(25) ఇంటికొచ్చే క్రమంలో కారులోనే ఆమెపై శివకుమార్ లైంగికదాడికి పాల్పడినట్టు కేసు నమోదు అయ్యింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నిందితుడిని మధురలో డిసెంబర్ 7వ తేదీన అరెస్టు చేశారు. ఈ కేసులో 100 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. 44 మందిని సాక్షులను విచారించారు. -
సాక్షుల్ని మళ్లీ విచారించండి
న్యూఢిల్లీ: ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులను మరోసారి విచారించాలని కోరుతూ ఉబర్ క్యాబ్‌లో అత్యాచార కేసు నిందితుడు శివ్‌కుమార్ యాదవ్ స్థానిక న్యాయస్థానాన్ని కోరారు. సోమవారం ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనతో పనిచేస్తున్న న్యాయవాదికి వాదనను బలంగా వినిపించే శక్తి లేదని యాదవ్ తర ఫు న్యాయవాది ధర్మేంద్ర మిశ్రా ఈ సందర్భంగా అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాకు తెలియజేశారు. ప్రాసిక్యూషన్ తరఫు సాక్షుల వద్ద మరికొన్ని వివరణలను తీసుకోవాల్సి ఉందని, అందువల్ల మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉందని విన్నవించారు. అయితే ఈ వాదనను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు. విచారణను జాప్యం చేసేందుకు జరుగుతున్న యత్నమని ఆరోపించారు. కాగా ఈ పిటిషన్‌పై ఈ నెల 18వ తేదీన కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. -
ఉబర్ రేప్ కేసు నిందితుణి ్ణ గుర్తించిన బాధితురాలి స్నేహితురాలు
న్యూఢిల్లీ: ఉబర్ రేప్ కేసులో నిందితుడిని బాధితురాలి స్నేహితుడు గుర్తించాడు. శివ్‌కుమార్ యాదవ్ అత్యాచారానికి పాల్పడినట్టు కోర్టుకు తెలియజేశాడు. గత ఏడాది డిసెంబర్ ఐదో తేదీన బాధితురాలైన మహిళా ఎగ్జిక్యూటివ్‌పై నిందితుడు ఉబర్ సంస్థకు చెందిన కారులో అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైన సంగతి విదితమే. ఈ కేసు మంగళవారం విచారణకురాగా ప్రాసిక్యూషన్ తరఫు సాక్షి అయిన ఆయుష్ డాబాస్ గుర్తించాడు. ఘటన జరిగిన రోజున బాధితురాలుగానీ, డ్రైవర్గానీ మద్యం మత్తులో లేరని తెలిపాడు. ఆ రోజు రాత్రి బాధితురాలితోపాటు తాను భోజనం కోసం గుర్గావ్లోని సైబర్ హబ్‌కు వెళ్లామని, వెనుదిరిగి వచ్చే సమయంలో బాధితురాలికోసం ఉబర్ యాప్‌ద్వారా కారునను కిరాయికి తీసుకుని బయల్దేరిందని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాకు తెలియజేశాడు. కారు వచ్చిన సమయంలో నిందితుడి వివరాలను తెలుసుకున్నానని తెలిపాడు. ప్రియా మార్కెట్ ప్రాంతం వద్ద బాధితురాలు కారులో బయల్దేరిందని తెలిపాడు. ఉబర్ యాప్‌లో డ్రైవర్ ఫొటో చూశానని, అందువల్లనే నిందితుడిని గుర్తించానని తెలిపాడు. ఆలస్యమైందనే వెంట వెళ్లలేదు ఆ రోజు బాగా పొద్దుపోయిందని, అందువల్లనే బాధితురాలితోపాటు తాను కూడా అదే కారులో ఎక్కలేదని ఆయుష్ తెలిపాడు. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌విహార్ ప్రాంతంలో తాను ఉంటానని, ఇంకా మరింత ఆలస్యమవుతుందనే ఉద్దేశంతోనే తన దారిని తాను వెళ్లిపోయానన్నాడు. కాగా బాధితురాలి స్నేహితుడితోపాటు ప్రాసిక్యూషన్ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అల్మా మింజ్ వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదుచేసింది. -
పిన్నినీ వదలని 'ఉబెర్' రేపిస్టు!!
ఢిల్లీలో ఉబెర్ క్యాబ్ అత్యాచార ఘటనలో నిందితుడు శివకుమార్ యాదవ్ అకృత్యాలు ఒక్కోటీ బయటకు వస్తున్న కొద్దీ అతడి విశ్వరూపం బయటపడుతోంది. రెండేళ్ల క్రితం అతడు తన సొంత గ్రామమైన రాంనగర్లో 'పిన్ని' అని పిలిచే మహిళను కూడా వదలకుండా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్నాళ్లూ బయట పెట్టలేక లోలోపలే కుమిలిపోతూ ఉన్నారు. అతడు ఉండే వీధిలోనే తాము కూడా ఉండేవాళ్లమని, శివకుమార్ తనను పిన్ని అని పిలిచేవాడని ఆమె తెలిపారు. అయితే, అతడు తనపై అఘాయిత్యం చేసిన విషయాన్ని బయటపెట్టొద్దని, అలా చేస్తే కుటుంబ పరువు మంటగలిసిపోతుందని భర్త వారించడంతో ఇన్నాళ్లూ ఊరుకున్నానన్నారు. తొలిసారి 2013 ఆగస్టులో అతడు తనను తుపాకితో బెదిరించి అత్యాచారం చేశాడని చెప్పారు. తాను చెత్త పారబోయడానికి వెళ్లినప్పుడు బలవంతంగా లాగి, నోరు నొక్కేశాడన్నారు. అయితే.. అలా అతడి చేతుల్లో అత్యాచారాలకు గురై.. బయట పెట్టకుండా ఊరుకున్నవాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. ఇప్పటివరకు శివకుమార్ యాదవ్‌పై ఆరు అత్యాచారం కేసులు నమోదయ్యాయి. వాళ్లలో గుర్గావ్లోని ఓ బార్ డాన్సర్ కూడా ఉన్నారు. ఆ కేసులో అతడు ఏడు నెలల జైలుశిక్ష అనుభవించాడు. మరో సందర్భంలో అయితే 18 ఏళ్ల యువతి కాలేజిలో మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో యాదవ్ చేతిలో అత్యాచారానికి గురైంది. దాంతో ఆమె చదువు ఆపేసింది. తండ్రి ఆమెకు పెళ్లిచేసి వేరే ఊరు పంపేశారు. ఇలాంటి దారుణాలు చాలా ఉన్నాయని రాంనగర్ గ్రామస్థులు చెబుతున్నారు. -
హస్తినలో అత్యాచారం .. మధురలో నిందితుడు
-
హస్తినలో అత్యాచారం .. మధురలో నిందితుడు
న్యూఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో శుక్రవారం రాత్రి అత్యాచారానికి గురైన యువతి (27) కేసును న్యూఢిల్లీ పోలీసులు ఆదివారం ఛేదించారు. క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌ను పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని న్యూఢిల్లీకి తీసుకు వస్తున్నారు. దేశ రాజధాని హస్తినలో అత్యాచారినికి గురైన యువతి కేసులో క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో నిందితుడిని అదుపులోకి తీసుకుని న్యూఢిల్లీకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. బాధితురాలు గుర్గావ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తుంది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ప్రెండ్స్‌తో పార్టీకి వెళ్లి... బాగా పొద్దుపోయిన తర్వాత ఒంటరిగా క్యాబ్‌లో ఇంటికి బయలుదేరింది. ఆ క్రమంలో నిద్రలోకి జారుకుంది. ఆ విషయం గమనించిన క్యాబ్ డ్రైవర్... కారును నిర్మానుష్య ప్రాంతానికి తరలించాడు. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అతడిని ప్రతిఘటించి... కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని ఆమెపై దాడికి దిగాడు. ఆమెపై అత్యాచారం చేసి అక్కడ నుంచి పరారైయ్యాడు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా నిందితుడు మధురలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.